హీరో విజయ్ దేవరకొండ జూలై 26న డియర్ కామ్రేడ్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా దక్షిణాది భాషల్లో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా విడుదల కాకముందే విజయ్ దేవరకొండ మరో భారీ బడ్జెట్ తో దక్షిణాది భాషా చిత్రాన్ని సిద్ధం చేసుకున్నారు.
ఆ సినిమాయే పేరు హీరో ఇందులో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ బైకర్‌గా కనపడతారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అంతే కాకుండా ఇటీవల ఓ యాక్షన్ సన్నివేశం కోసం చిత్ర యూనిట్ దాదాపు 8 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లు సమాచారం. 20 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఔట్‌పుట్ పట్ల నిర్మాణ సంస్థ సంతృప్తి లేదు.
సినిమాను తాత్కాలికంగా ఆపారంటూ వార్తలు వినపడుతున్నాయి. కాగా మరో వర్గం ఇప్పటికే సినిమాకు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.ఈ సినిమాకి 50 కోట్ల బడ్జెట్ అనుకున్నారు.కానీ సింగల్ షెడ్యూల్ కె 15 కోట్లు అంటే సరిగా రాలేదు అని మరియు దర్శకుడి పనితీరుతో నిర్మాతలు, హీరో సంతృప్తి పడలేదని కాబట్టి సినిమాను ఆపేశారని అంటున్నారు. మరి సినిమా ఆగిపోయిందా? తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయా? అని తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే.