రష్మిక ఫ్యాన్స్‌కి తిక్కరేగేలా..!
విజయ్ దేవరకొండ-రష్మిక మందనల లిప్ లాక్ సెన్సేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పెదవి ముద్దుల్ని పీక్స్‌కి తీసుకెళ్లిన జోడీగా పాపులరయ్యారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో పోటీ పడి మరీ చుంభనాలతో అదరగొట్టారు. తాజాగా ఈ ముద్దుల వ్యవహారాన్ని వేరొక కన్నడ నటి హరిప్రియ తన సినిమా ప్రచారానికి వాడుకుంటోంది. ప్రస్తుతం హరిప్రియ కన్నడ లో `ఎల్లిదే ఇల్లితనకా` అనే సినిమాలో నటించింది. త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ప్రచారంలో భాగంగా కన్నడలోనూ బాగా పాపులర్ అయిన రష్మిక పేరును ఇష్టానుసారం వాడేస్తూ.. నెగెటివ్ ప్రొపగాండా చేస్తోంది.
ఎల్లిదే ఇల్లితనకా లో కూడా హరిప్రియ ఘాటైన చుంబనాలతో చెలరేగిపోయిందట. హీరో సృజన్ లోకేష్ తో వేడెక్కించే ముద్దు సన్నివేశాలున్నాయి. దీంతో రష్మిక, విజయ్ దేవరకొండ లిప్ లాక్ ల్లానే వీళ్లిద్దరి మధ్య కూడా పెదవి ముద్దులున్నాయని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో హరిప్రియ ఆ ప్రచారంపై స్పందించింది. హరిప్రియ మాట్లాడుతూ.. “అవును.. ముద్దు సన్నివేశంలో నటించా. కానీ రష్మికలా పెదవి ముద్దు కాదు…మా ముద్దు వేరే! అంటూ క్లారిటీ ఇచ్చింది. నా అభిమానులు ఫ్యామిలీతో కలిసి చూసేలా సినిమా ఉండాలి. ఓ నటిగా అది నా బాధ్యత. స్టోరీ డిమాండ్ మేరకే ఆ ముద్దు సీన్ లో కూడా నటించా అని తెలిపింది. లేదంటే ఆ సీన్ కూడా ఉండదని కరాఖండిగా చెప్పేసింది. అయితే తన సినిమా ప్రచారం కోసం సాటి నాయికపై అలా అభాండం వేసిందేమిటో! అంటూ రష్మిక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ అమ్మడిపై విరుచుకుపడుతున్నారు. హరి ప్రియ గతంలో తెలుగులో పలు బీ-గ్రేడ్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో కెరీర్ పరంగా వెనకబడిన క్రమంలో మాతృపరిశ్రమకే అంకితమైంది.