పాప్ మ్యూజిక్ రాక్‌స్టార్ జస్టిస్ బీబర్ తన లేటెస్ట్ గాళ్ ఫ్రెండ్ హెయిలీ బాల్డ్‌విన్‌ను ముద్దుల్లో ముంచెత్తుతున్నాడు. ఎందుకంటే ఈ రోజు హెయిలీ బాల్డ్‌విన్ పుట్టిన రోజు. ఈ రోజుతో ఈ మోడల్ కు 22 నిండుతాయి. పుట్టిన రోజు సందర్బంగా నిన్న రాత్రి ఈ ముద్దుగుమ్మ గ్రాండ్ స్టైల్లో …న్యూయార్క్ సిటీ మొత్తం రచ్చ రచ్చ చేసింది. ఆల్ట్రా షార్ట్ డ్రస్ వేసుకుని, పైన ఓ స్వీపింగ్ కోట్ వేసుకుంది. తన స్నేహితులతో కలిసి ఆమె రాత్రంతా డాన్స్ లు, నవ్వులు, పాటలతో గడిపేసింది.
ఈ సంవత్సరం ఆమె జీవితంలో గోల్డెన్ ఇయిర్ గా చెప్తోంది. ఎందుకంటే ఆమెతో బీబర్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అయితే పెళ్లి కూడా అయ్యిపోయిందిని మీడియా అంటోంది కానీ వారు కన్ఫర్మ్ చేయలేదు. కానీ బాల్డోవిన్ మాత్రం తన ఇనిస్ట్రగ్రమ్ ఎక్కౌంట్ పేరు మాత్రం బీబర్ అని వచ్చేలా మార్చేసింది. పుట్టిన రోజు సందర్బంగా ఇదిగో వీళ్లిద్దరూ ఇలా ముద్దుల్లో మునిగిపోయారని సోషల్ మీడియా గుర్తు చేస్తోంది.
ఇదిగా ఉంటే తన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు జస్టిన్ బీబర్ మ్యారేజ్ లైసెన్స్ తీసుకున్నాడు. ఈ ఇద్దరూ పెళ్ళి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ చర్చ్ లేదా ఆ దేశానికి సంబంధించిన స్టేట్ అథారిటీ ఇచ్చే సర్టిఫికేట్ ని వారిద్దరూ పొందారు. ఇక జూలై నెలలో ఈ జంట రింగులు మార్చుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ యువ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అని బీబర్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.