2021 సంక్రాంతికి అర‌డ‌జ‌ను రిలీజ్‌లు

                                            కోవిడ్‌కి వ్యాక్సిన్ వ‌స్తేనే….!

ప్ర‌తియేటా సంక్రాంతి వ‌స్తోంది అంటే సినిమా రిలీజ్ ల‌తో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. గ‌త రెండేళ్లుగా నాలుగైదు సినిమాలు ఒక‌దాని వెంట ఒక‌టిగా రిలీజ‌వుతున్నాయి. వీటిలో రెండు మూడు పెద్ద హీరోలు న‌టించిన సినిమాలు త‌ప్ప‌నిస‌రి.

ఈ ఏడాది సంక్రాంతికి మ‌హేష్ న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు.. బ‌న్ని న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో రిలీజ‌య్యాయి. వీటితో పాటు మ‌రో రెండు సినిమాలు రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. 2021 సంక్రాంతి ప‌రిస్థితేమిటి? అన్న‌దానికి ఇండ‌స్ట్రీ ఇన్ సైడ్ సోర్స్ ప్ర‌కారం.. అర‌డ‌జ‌ను పైగానే సినిమాలు రిలీజ్ బ‌రిలో ఉన్నాయ‌ని తెలుస్తోంది.

ఈసారి సంక్రాంతికి సంచ‌ల‌నాల కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2 రిలీజ‌వుతోంది. దాంతో పాటు స్ట్రెయిట్ మూవీస్ రంగ్ దే .. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ పోటీప‌డుతున్నాయి. భీష్మ లాంటి గ్రాండ్ స‌క్సెస్ త‌ర్వాత యూత్ స్టార్ నితిన్ న‌టించిన రంగ్ దే పై అంచ‌నాలున్నాయి. అలాగే హ్యాట్రిక్ ఫ్లాపుల‌తో డీలా ప‌డ్డ అఖిల్ ఎట్టి ప‌రిస్థితిలో హిట్టు కొట్టాల‌న్న పంతంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ లో న‌టిస్తున్నాడు. ఇక వీళ్ల‌కు పోటీగా ర‌జ‌నీకాంత్… విజ‌య్ లాంటి స్టార్లు న‌టించిన అనువాద చిత్రాలు రిలీజ‌వుతాయ‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు కోవిడ్ వ‌ల్ల వాయిదా ప‌డిన‌వ‌న్నీ సంక్రాంతి ఆశ‌తోనే ఉన్నాయి. అయితే అప్ప‌టికి వ్యాక్సిన్ లేదా టీకా వ‌స్తుందా రాదా? అన్న‌దే రిలీజ్ ల‌ను డిసైడ్ చేస్తుంది.