బాలయ్యకు ‘బిగ్ బాస్’ కౌశల్ కు ఫైట్

అవును ..త్వరలో బాలకృష్ణ , కౌశల్ మధ్య ఫైట్ జరగబోతోంది. కంగారుపడకండి అది తెరమీదే . ఆ ఫైట్ ని సెట్ చేసేది ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను అని తెలుస్తోంది. సింహా, లెజండ్ చిత్రాలతో బాలయ్యని అభిమానులకు కన్నుల పండగగా చూపించి సూపర్ హిట్ కొట్టిన బోయపాటి తన తదుపరి చిత్రం మళ్లీ బాలయ్యతో చేయనున్నారు. ఈ మేరకు బాలయ్యను తెరపై ఎదుర్కొనే విలన్ గా కోసం అన్వేషిస్తూండగా కౌసల్ ఆయన దృష్టిలో పడ్డట్లు తెలుస్తోంది.
 
బిగ్ బాస్ తో కౌసల్ కు ఓ రేంజి పాపులారిటి వచ్చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ..కౌసల్ ఆర్మి అయితే ఓ రేంజిలో రచ్చ రచ్చ చేస్తోంది. దాంతో ఈ స్దాయి పాపులారిటి ఉన్న ఆర్టిస్ట్ అయితే బాలయ్యకు సరైన ప్రత్యర్దిగా ఉంటాడని బోయపాటి భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
అయితే   బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఇప్పుడు కౌశల్ తో మాట్లాడటం కుదరదు.కాబట్టి కౌశల్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం పై చర్చలు జరుపుతారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. మొత్తానికి కౌసల్ మంచి ఆఫరే సాధించాడు. జగపతిబాబుని విలన్ గా చూపించి బిజీ చేసిన బోయపాటి కౌసల్ కు కూడా ఖచ్చితంగా లైఫ్ ఇస్తాడని ఆయన ఫ్యాన్స్ నమ్ముతున్నారు