ఇన్సైడ్ టాక్ : నెక్స్ట్ “బిగ్ బాస్” కి ఊహించని హోస్ట్ ని దింపుతున్నారా?

ఇండియా మార్కెట్ లో స్మాల్ స్క్రీన్ రంగం కూడా చాలా పెద్దది అయితే ఇందులో అనేక షో లు సీరియల్స్ మంచి టీఆర్పీ నమోదు చేస్తూ ఉంటాయి. అది హిందీ తమిళ్ మరియు మన తెలుగు నుంచి ఎక్కువ రేటింగ్స్ నమోదు అవుతాయి. అయితే హిందీలో ఎపుడు నుంచో ఉన్న గ్రాండ్ అండ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కోసం అందరికీ తెలుసు.

దీనిని తెలుగులో ఊదా స్టార్ట్ స్టార్ట్ మన ఇండియా లో హైయెస్ట్ రేటింగ్ రాబట్టిన షో గా మన తెలుగు సీజన్ అయితే నిలిచింది. కానీ గత రెండు సీజన్లో మాత్రం రొటీన్ హోస్ట్ కావడంతో బిగ్ బాస్ రేటింగ్స్ బాగా డౌన్ అయిపోయాయి. అయితే అందుకే ఈ సారి బృందం ఊహించని గెస్ట్ ని దింపే ప్రయత్నం గట్టిగా చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో ఇన్సైడ్ టాక్.

మరి దీనితో అయితే నెక్స్ట్ సీజన్లో బిగ్ బాస్ హోస్ట్ గా కనిపించేది మరెవరో కాదట నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బాలయ్య ఆహ లో ఓ టాక్ షో తో బెస్ట్ హోస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. మరి దీనితో బాలయ్యతో నెక్స్ట్ సీజన్ హోస్ట్ గా చేయిస్తే బాగుంటుదని ప్లాన్ అట.

అయితే ఇది ఎంత వరకు ఫిక్స్ అయ్యింది? బాలయ్య ఒప్పుకుంటారా లేదా అనే దానిపై అధికారిక క్లారిటీ  ఇది నిజం గాని అయితే మళ్ళీ బిగ్ బాస్ కి భారీ రేటింగ్ రావడం ఖాయం.