ఇండస్ట్రీ టాక్ : ఇక నెక్స్ట్ నుంచి “బిగ్ బాస్” బాలయ్య? 

తెలుగు బుల్లితెర దగ్గర ఎన్నో ఛానెల్స్ లో అయితే ఇప్పుడు అన్ని రకాలుగా కూడా టాప్ లో ఉన్న ఛానెల్ ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా స్టార్ మా అని చెప్పాలి. ఐతే ఈ ఛానెల్ లో పలు షోస్ పరంగా మాత్రం ఇతర కొన్ని ఛానెల్స్ తో అంతగా పోటీ పడలేకపోయేది.

కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ అనే షో స్టార్ట్ అయ్యిందో అక్కడ నుంచి ఆ స్లాట్ ను కూడా కబ్జా చేసేసి భారీ తీర్ప రేటింగ్స్ ని సెట్ చేసుకుంది. మరి ఈ షో అయితే ఇప్పటివరకు 7 సీజన్లకి చేరుకోగా అందులో నాలుగు సీజన్లను హోస్ట్ గా కింగ్ నాగార్జునే చేశారు. దీనితో ఆడియెన్స్ కూడా కాస్త కొత్తదనం కోరుకంటూ ఉండగా..

నెక్స్ట్ టైం మాత్రం ఊహించని పర్సనాలిటీ హోస్ట్ గా కనిపిస్తాడు అని రూమర్స్ ఇది వరకే వచ్చాయి. అలా నందమూరి నటసింహ బాలయ్య అయితే హోస్ట్ గా కనిపిస్తారని ఈ సీజన్ 7 కే వార్తలు వినిపించాయి కానీ ఫైనల్ గా నాగార్జునే చేశారు.

అయితే ఇపుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే బిగ్ బాస్ 8వ సీజన్లో లో హోస్ట్ గా బాలయ్య కనిపిస్తాడని స్ట్రాంగ్ రూమర్స్ ఇపుడు మొదలయ్యాయి. నాగ్ అయితే తప్పుకోనుండగా నెక్స్ట్ నుంచి ఆ భాద్యతలు బాలయ్య చేపట్టనున్నారని ఇప్పుడు వినిపిస్తుంది. మరి ఇందులో ఇంకా అఫీషియల్ క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది.