మెగాస్టార్ చిరంజీవి హీరోగా లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా “గాడ్ ఫాదర్”. తమిళ స్టార్ దర్శకుడు జయం మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం మలయాళంలో భారీ హిట్ అయినటువంటి “లూసిఫెర్” కి రీమేక్ గా చేయగా..
ఆడియెన్స్ లో అయితే ఇప్పుడు మంచి అంచనాలు కూడా స్టార్ట్ అయ్యాయి. సరే ఇదంతా బాగానే ఉన్నా సినిమా అవుట్ ఫుట్ అయితే ఎలా ఉంటుందా అని చాల మంది ఆసక్తిగా ఎదురు చూస్తుండగా స్వయంగా దర్శకుడే మంచి అప్డేట్ ని అందించాడు.
ఈ చిత్రం చూసిన సెన్సార్ యూనిట్ ఏం చెప్పారో రివీల్ చేస్తూ వారి రివ్యూ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు. గాడ్ ఫాదర్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని యూ బై ఏ సర్టిఫికెట్ అందుకుంది తెలిపారు. అలాగే సినిమా చూసాక అయితే సెన్సార్ సభ్యులు సినిమాపై అమేజింగ్ గా ప్రశంసలు అందించారని గుడ్ న్యూస్ ని తాను షేర్ చేసుకున్నారు.
దీనితో ఇక రిలీజ్ రోజు ఆడియెన్స్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నానని మోహన్ రాజా మెగా ఫ్యాన్స్ కి అదిరే న్యూస్ ని అయితే అందించారు. ఇంకా ఈ సినిమాలో అయితే సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటించగా ఈ అక్టోబర్ 5న తెలుగు మరియు హిందీలో సినిమా రిలీజ్ కాబోతుంది.
It’s a Clean U/A with an amazing appreciation from the Censor authorities
Waiting for the audience blessing on #GodFatherOnOct5th— Mohan Raja (@jayam_mohanraja) September 23, 2022