మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలి : నటుడు ఉపేంద్ర

కర్ణాటకలోని ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇవ్వాలని ప్రముఖ నటుడు ఉపేంద్ర డిమాండ్‌ చేశారు. ఇందుకోసం పోరాటం సాగిస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.‘కర్ణాటకలో ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలి. రాష్ట్రంలోని ఉద్యోగాల్లో మన వారికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అందరి ఆలోచన కూడా. ఇందుకోసం నేను పోరాటం చేస్తాను.

ఈ మేరకు ఈ నెల 14, 15 తేదీల్లో గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేస్తాను. స్వతహాగా బెంగళూరు ఐటీ రాజధాని కావడంతో దేశ నలుమూలల నుంచి ఉపాధి కోసం అక్కడికే వస్తుంటారు. దీంతో స్థానికులకు అన్యాయం జరుగుతుందనే వాదన ఎప్పటి నుంచో ఉంది.