రానా పాన్ ఇండియా ప్ర‌య‌త్నంపై తాజా అప్‌డేట్

రానా ప్ర‌స్తుతం విరాటపర్వం చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రజెంట్ కేరళ అడవుల్లో జరుగుతోంది. భారీ యాక్షన్ సీన్స్ ని రానాపై తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు రానా న‌టించిన హాథీ మేరా సాథీకి సంబంధించి తాజా స‌మాచారం తెలియాల్సి ఉంది. మ‌రోవైపు హిర‌ణ్య క‌శిప ప్రాజ‌క్టుకు సంబంధించిన‌ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

స‌మ్మ‌ర్ నాటికి విరాట ప‌ర్వం పూర్త‌యిపోతే వెంట‌నే హిర‌ణ్య‌క‌శిప షెడ్యూల్ ప్రారంభ‌వుతుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తికావడానికి సుమారు 8 నెలలు పండుతుందని టీమ్ అంచనా వేస్తున్నారట.
ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా విదేశాల్లోనూ ప్రీప్రొడ‌క్ష‌న్ యానిమేష‌న్ ప్రీవిజువ‌ల్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా కేట‌గిరీలో తెలుగు-త‌మిళం-హిందీ స‌హా ప‌లు భాష‌ల్లో రిలీజ్ కానుంద‌ని స‌మాచారం.