సందీప్ కిషన్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ ..ఇంట్రస్టింగ్ (పోస్టర్)

కథ నచ్చి వేరే ప్రొడ్యూసర్స్ ఆ కథను చేయటానికి ఇంట్రస్ట్ చూపనప్పుడో ..లేకే వేరే వాళ్ళపై మన అభిరుచులు రుద్దటమెందుకో అనుకున్నప్పుడు హీరోలు నిర్మాత అవతారం ఎత్తుతున్నారు. ఇప్పుడు సందీప్ కిషన్ సైతం అదే బాటలో ప్రయాణం పెట్టుకున్నారు.

వరస ఫ్లాఫ్‌లతో సతమతమవుతున్నా… విభిన్నమైన కధాంశాలతో కూడిన సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్‌ కిషన్‌. అయితే స్టార్ ఇమేజ్‌ ను మాత్రం అందుకోలేకపోయాడు. హీరోగా తమిళంలో కాస్త పరవాలేదనిపించుకున్నా తెలుగులో లో మాత్రం హిట్ కాలేకపోయారు.

సందీప్‌ కిషన్‌ తన కెరీర్ లో సూపర్‌ హిట్ గా నిలిచిన సినిమా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ పేరు వచ్చేలా వెంకటాద్రి టాకీస్‌ బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగా మారాడు. తానే స్వయంగా హీరోగా నటిస్తూ ‘నిను వీడని నీడను నేనే’ సినిమాను నిర్మిస్తున్నాడు.తమిళ దర్శకుడు కార్తీక్‌ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఇక్కడ మీరు ఆ ఫస్ట్ లుక్ ని చూడవచ్చు.

ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు కునాల్‌ కోహ్లీ డైరెక్షన్‌లో నెక్ట్స్‌ ఏంటి సినిమా చేస్తున్న ఈ యంగ్ హీరో. సందీప్ ప్లే బాయ్‌ రోల్‌ పోషిస్తుండగా, మిల్క్‌ బ్యూటీ తమన్నా మరోసారి గ్లామరస్‌ రోల్‌తో ఆకట్టుకుంది. నవదీప్‌ ఏజ్డ్‌ రోల్‌లో డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్య​క్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.

‘ఫనా, హమ్‌ తుమ్‌’ వంటి బాలీవుడ్‌ హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన కునాల్‌ కోహ్లి సందీప్‌ కిషన్‌కు హిట్‌ అందిస్తాడని ఎంతో నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ చిత్రానికి లియోన్‌ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.