ఓటిటి : మొత్తానికి “బింబిసార” డిజిటల్ రిలీజ్ కి డేట్ ఖరారు.!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర భారీ బాక్సాఫీస్ హిట్స్ అయినటువంటి లేటెస్ట్ చిత్రాల్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “బింబిసార” కూడా ఒకటి. టైం ట్రావెల్ సహా పీరియాడిక్ నేపథ్యంలో యంగ్ దర్శకుడు వసిష్ఠ తెరకెక్కించిన ఈ చిత్రం 35 కోట్లకి పైగా షేర్ రాబట్టి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఓ బిగ్ హిట్ గా నిలిచింది.

ఇక ఆల్రెడీ 50 రోజులకి పైగానే పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి గాను ఆడియెన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఫైనల్ గా అయితే ఈ సినిమాని సొంతం చేసుకున్న జీ 5 స్ట్రీమింగ్ సంస్థ దీనిపై అధికారిక అనౌన్స్ చేసేసారు.

తమ అప్ కమింగ్ సినిమాల లిస్ట్ లో బింబిసార డిజిటిల్ రిలీజ్ ఈ అక్టోబర్ 21న ఉంటుంది అని అయితే చేశారు. సో ఈ అవైటెడ్ సినిమా ఈ అక్టోబర్ 21 నుంచి జీ 5 లో అందుబాటులోకి రానుంది. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్, క్యాథరిన్ లు హీరోయిన్స్ గా నటించగా కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించాడు.