చిన్నికృష్ణకు దిమ్మతిరిగే షాక్

రచయిత చిన్ని కృష్ణకు ఊహించని షాక్ తగిలింది . చిన్ని కృష్ణ రాసింది తక్కువ
సినిమాలే కానీ పేరు మాత్రం ఎక్కువ వచ్చింది . కారణం అతన్ని అతను ప్రమోట్
చేసుకోడం. చిన్ని కృష్ణ తెలుగు సినిమా రచయితల స్టేటస్ పెంచానని చెబుతాడు .
ఎంతో కాలం నుంచి వున్న పరుచూరి బ్రదర్స్ కన్నా తనకే ఎక్కువ పారితోషికం
ఇస్తారని గర్వగా చెబుతాడని  సహా రచయితలు  అంటారు .

చిన్నికృష్ణ స్టైల్ , బిహేవియర్ , మాట్లాడే విధానం అన్నీ భిన్నంగా ఉంటాయి .
అందరి కంటే తాను  సుపీరియర్ నన్న అభిప్రాయం అతనిలో బలంగా వుంది . చిన్నికృష్ణ
, నరసింహ నాయుడు , సీమ సింహం, ఇంద్ర, గంగోత్రి , బద్రీనాథ్ సినిమాలకు కథలు
అందించాడు . ఆసినిమాలు సూపర్ హిట్ కావడంతో తెలియని అహం వచ్చేసిందని
చెప్పుకుంటారు .  అందుకే అతను ఎప్పుడూ  వివాదాల్లో ఉంటాడని సన్నిహితులు
ఆరోపిస్తుంటారు . ఇతని ప్రవర్తనకు  విసిగిపోయిన అల్లు అరవింద్  బద్రీనాథ్
సమయంలో మీడియా ముందుకు రాకుండా పక్కన పెట్టారని చెప్పుకుంటారు .

ఇక తాజాగా చిన్ని కృష్ణ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో సభ్యుడుగా చేరాలని
నిర్ణయించుకున్నాడు . తనకు తెలిసిన ఓ సభ్యుడిని సలహా అడిగితె “తప్పకుండా
చేరండి , నేను ఇంట్రడక్షన్ సంతకం పెడతాను ” అని హామీ ఇచ్చాడు . ఆయన అధ్యక్షుడు
కెఎల్ నారాయణ గారితో మాట్లాడితే , “సినిమా కేటగిరి లో తీసుకుందాం , అతను రచయిత
కదా ” అన్నాడు . మామూలువారికి అయితే 16 లక్షలు వుంది. అదే సినిమా విభాగంలో
అయితే 6 లక్షలే .  చిన్ని కృష్ణను పిలిచి  అప్లికేషన్ ఫారం ఇచ్చారు . అది
పూర్తి చేసి ఫిలిం నగర్ కల్చరల్  ఉద్యోగితో మాట్లాడుతూ అతన్ని తిట్టాడు .
అధ్యక్షుడు నారాయణ గారికి ఫోన్ చేశాడు .  ఆయన ఎవరితోనో ఒక సారి మాట్లాడండి ,
సినిమా క్యాటగిరి ఆయన చూస్తాడు అని చెప్పాడు . దానికి చిన్ని కృష్ణ నారాయణ
గారితో   అనుచితముగా మాట్లాడినట్టు  తెలిసింది . రెండురోజుల తరువాత కల్చరల్
సెంటర్ కు ఇంటర్వ్యూకు వచ్చాడు . అతనితో మాట్లాడి తరువాత తెలియజేస్తాం అని
నారాయణ గారు అన్నారట. తీరా ఎవరైతే చిన్నికృష్ణను రెకమెండ్ చేశారో ఆ సభ్యుడుకు
 ఫోన్ చేసి ” చిన్ని  కృష్ణ అప్లికేషన్ రిజెక్ట్  చేశాం , ఈ విషయం ఆయనకు
చెప్పండి ” అని చావు కబురు చల్లగా చెప్పారట.  నోరు వుంది కదాని పారేసుకుంటే
ఇలాగే జరుగుతుందేమో ? ఇది చిన్ని కృష్ణకు ఊహించని షాక్ . కాదంటారా ?