టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరదాగా వుంటారు. బయట.. ఇంటా కూడా ఆయన శైలి అలాగే వుంటుంది. తన పిల్లలతోనూ అంతే సరదాగా గడిపేస్తుంటారు. తాజాగా తన కూతురు అర్హతో బన్నీ సాగించిన `బే` సంభాషణకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సరదాగా తన కూతుల్ని బన్నీ `బే` అని పిలిచారు. అర్హ కూడా బన్నీని బే అని సంబోధించడం ఆకట్టుకుంటోంది.
ముద్దు ముద్దు మాటలతో తండ్రి బన్నీ ఒడిలో అర్హ అల్లరి చేస్తున్న వీడియోకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
వీడియోలో బన్నీ.. అర్హ సంభాషణ ఇలా సాగింది.
బన్నీ : నీ ఫేవరేట్ కలర్ ఏంటి బే
అర్హ : పింక్ బే
బన్నీ : నన్ను బే అంటావా బే..
అర్హ : అవును బే
బన్నీ : అ.. టు టైమ్స్ బే అంటావా బే?
అర్హ : అవున్ బే
బన్నీ : త‌్రీటైమ్స్ సొంత ఫాదర్‌ని, కన్నతండ్రిని ఇన్నిసార్లు బే అంటావా బే
అర్హ : అవును బే
బన్నీ : మళ్లీ బే.. నీకు అసలు భయం వుందా బే
అర్హ : లేదు బే
బన్నీ : మళ్లీ బే అంటావా నన్ను..
అంటూ తండ్రీ కూతుళ్ల సరదా సంభాషణ సాగింది. అయితే ఇది జస్ట్ ఫర్ ఫన్ అని తనే నా బే అని ..ఇది ఫాదర్ డాటర్ లవ్ అని బన్నీ పోస్ట్ చేశారు.