తెలుగులో యంగ్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అతని క్రేజ్‌ని గుర్తించిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన `ఆహా`కు బ్రాండ్ అంబాసిడర్‌గా అపాయింట్ చేసుకున్నారు. యువతలో రౌడీ ఫాలోయింగ్‌కి బిగ్ ప్రొడ్యూసర్సే ఫిదా అవుతుంటే ఈ క్రేజ్‌ని తాను కూడా వాడుకోవాలనుకున్నాడో మోసగాడు. అనుకున్నదే తడవుగా విజయ్ దేవరకొండ పేరుతో సోషల్ మీడియా ట్విట్టర్‌లో ఫేక్ అకౌంట్‌ని క్రియేట్ చేశాడు.
విజయ్ అంటే క్రేజ్ అబ్బాయిల్లోనే కాదు అమ్మాయిల్లోనూ వుంది. అదే మోసగాడికి మంచి ఆయుధంగా మారింది. దాన్ని అడ్డం పెట్టుకుని అమ్మాయిల్ని ముగ్గులోకి దింపడం మొదలుపెట్టాడు. ఒక్కరు కాదు ఏకంగా పది మందిని ట్రాప్‌లో పడేశాడు. ఆ తరువాత మాయమాటలు చెబుతూ ప్రేమ పెళ్లి అంటూ డబ్బులు గుంజడానికి ఉపక్రమించాడు. ఈ విషయం గ్రహించిన విజయ్ సన్నిహితులు ఆ విషయాన్ని విజయ్ దేవరకొండకు చేరవేశారు. ఇంకేముంది మనోడు అతని పర్సనల్ అసిస్టెంట్ గోవిందుని రంగంలోకి దింది ఆ మోసగాడి ఆట కట్టించాడు. సైబర్ పోలీసులకు అతడిపై ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.