KTR: కేటీఆర్ పై విమర్శలు చేసిన దిల్ రాజు… సీఎం రేవంత్ కోరుకున్నది ఇదేనా?

KTR: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ సర్కార్ సీరియస్ గా తీసుకోవడమే కాకుండా అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు. ఇక ఈ విషయం కాస్త తెలంగాణ సర్కార్ వర్సెస్ ఇండస్ట్రీ అనే విధంగా మారిపోయింది. ఇకపోతే ఈ విషయాన్ని కేటీఆర్ తన రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.

రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను పక్కదోవ పట్టించడం కోసమే అల్లు అర్జున్ ను అరెస్టు చేయించారని అదేవిధంగా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడంతోనే కక్ష సాధింపు చర్యలలో భాగంగా తనని అరెస్టు చేయించారు అంటూ పదేపదే కేటీఆర్ ప్రస్తావిస్తూ వచ్చారు..

ఇలా కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సినిమా సెలబ్రిటీల భేటీలో భాగంగా రేవంత్ రెడ్డి ఇదే విషయం గురించి ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ తన పేరు మర్చిపోవడం వల్లే నేను అరెస్టు చేయించాను అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని ఖండించాల్సిన బాధ్యత తెలుగు చిత్ర పరిశ్రమకు లేదా అంటూ ఆయన సీరియస్ అయ్యారు.

ఇలా రేవంత్ రెడ్డి సీరియస్ కావడంతో ఇదే విషయంపై దిల్ రాజు స్పందిస్తూ కేటీఆర్ కు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు.చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దని దిల్ రాజు .. తన పదవి పేరుతో క్రియేట్ చేసిన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కాస్త ఘాటుగానే కేటీఆర్‌కు సమాధానం ఇచ్చారు. చిత్రపరిశ్రమ అభివృద్ధి కోసం ఎలాంటి దాపరికాలు లేకుండా ఎంతో స్నేహభావంతో ఈ సమావేశం జరిగిందని తెలిపారు. అనవసరమైనటువంటి వివాదాలలోకి మీ రాజకీయ స్వప్రయోజనాల కోసం దయచేసి చిత్ర పరిశ్రమను లాగొద్దు అంటూ ఈ సందర్భంగా కేటీఆర్ కు దిల్ రాజు కౌంటర్ ఇచ్చారు.