సెలబ్రిటీ వరల్డ్ లో ఏఫైర్లు సర్వసాధరణం. ఒక హీరోతో బ్రేకప్ తర్వాత మరో హీరోతో లవ్వాయణం సాగించడం బాలీవుడ్ లాంటి చోట చాలా సహజం. ఒక హీరోతో డేటింగ్..మరో హీరోతో పెళ్లి వంటివి నిత్యం చూసేవే. ప్రేమాయణాల విషయానికొస్తే టాలీవుడ్ చాలా బెటర్. ఇక్కడ ఎఫైర్లు నెరిపినా చాలా సీక్రెట్ గా ఉంటాయి. బయటకు లీకవ్వడం చాలా రేర్. తాజాగా ఓ హాట్ లేడీ మ్యూజిక్ డైరెక్టర్ ఎఫైర్ల కహానీ తాజాగా సంచలనంగా మారింది. ఆమె టాలీవుడ్ లో ఒకప్పుడు చాలా సినిమాలకు సంగీతం అందించారు.
తర్వాత కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు..పరభాష సంగీత దర్శకులు దూసుకురావడంతో అవకాశాలు తగ్గాయి. అయినా అప్పుడప్పుడు తన బాణీని వినిపిస్తూనే ఉంటుంది. ఆమెకు ఓ ప్రముఖ సంగీత దర్శకుడి సోదరిగానూ గుర్తింపు ఉంది. అయితే ఆమె టాలీవుడ్ లో ఎఫైర్లు నెరపడంలో చాలా స్పీడ్ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మందితో గతంలో ఏఫైర్లు నడిపించిందిట. ఆ ఎఫైర్లు పరిశ్రమ వర్గాల్లో నెగెటివ్ అయ్యాయట. ఆ కారణంగాను అవకాశాలు తగ్గాయని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.
దీంతో సింగర్ గా నైనా స్థిరపడాలని అనుకుంటోన్న సమయంలో ఆ రకంగాను ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదని…ఇంట్లో వాళ్లు కూడా అమ్మడిని వేరుగా చూడటం మొదలు పెట్టారుట. దీంతో ఆమె కొన్నాళ్లుగా ఒంటరిగానే లైఫ్ ని లీడ్ చేస్తోందని… ఈ మధ్య మరోసారి కుటుంబ సభ్యులు పెళ్లి చేసి ఓ ఇంటిదాన్ని చేద్దామని చూసారుట. ఆ మాట ఎత్తగానే పెళ్లి అంటే గిట్టదని సెలవిచ్చింది. పెళ్లితో బందీ అయ్యే లైఫ్ తనకెంత మాత్రం ఇష్టం లేదని కరాఖండీగా చెప్పేసిందిట. దీంతో కుటుంబంలో ఆ లేడీ మ్యూజిక్ డైరెక్టర్ మరీ బ్యాడ్ అయిందని టాక్ వినిపిస్తోంది.