ఎంత బూతు ఉంటే అంత పెద్ద హిట్ అన్నట్లు తెలుగు సినిమా పరిస్దితి తయారైంది. అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 చిత్రాలతో మొదలైన ఈ బూతు ప్రహసనం వాస్తవిక ముసుగులో మరోసారి రెచ్చిపోయింది. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో నటించిన విష్వక్సేన్ లీడ్ యాక్టర్ గా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్ నుమా దాస్’.
ఈ సినిమాలో పెళ్లి చూపులుతో ఘన విజయం సాధించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. మలయాళంలో సంచలనం సృష్టించిన రా అండ్ బోల్డ్ ఫిలిం ‘అంగామలి డైరీస్’ కు తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా తాజాగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం.
ప్రస్తుతం టీజర్ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటుంది. అయితే టీజర్ లో బూతు పదాలు మరీ ఎక్కువుగా ఉన్నాయని కొంతమంది పెదవి విరుస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే కొన్ని దారుణమైన బూతులను డైరెక్ట్ గానే పలికించారు.
“ఫలక్నామాలో బారబజే లేషినమా..ఏక్ బజే తిన్నమా.. రొండింటికి గలిషినామా..అడ్డమెవడన్నా వస్తే పగల ..”అంటూ ఫస్ట్ డైలాగ్ తోనే డైరెక్ట్ గా బూతుని అందించారు దర్శకుడు. అయితే వాస్తవికంగా జనం మాట్లాడుకునే భాష ఇది అని సరిపెట్టుకోమనే ఉద్దేశ్యం…దాని వెనక బూతుని క్యాష్ చేసుకుందామనే ఆలోచన స్పష్టంగా కనపడుతోంది.
లం…. కొడకా, గు…పగల్దే…. నమా , దే…… యాండ్రా లాంటి కొన్ని బూతు డైలాగ్స్ టీజర్ కే పరమితమవుతాయా.. సినిమాలో కూడా ఈ డైలాగ్స్ ఉంటాయా ? మ్యూట్ అవుతాయా ? అన్నది వేచి చూడాల్సిన అంశం.