యు/ఏ సర్టిఫికెట్ తో ఆగష్టు 15 న ‘ఎవరు’

అడివి శేష్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ఎవరు’. వెంకట్ రాంజీ దర్శకత్వం వహించగా శేష్ ఇందులో రెజీనా కాసాండ్రా హీరోయిన్ గా నటించారు. నవీన్ చంద్ర మరో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికెట్ తెచ్చుకుంది.

ఈ సినిమా ఈ నెల 15 న విడుదల కానుంది. తెలుగులో మళ్ళీ సస్పెన్స్ థ్రిల్లర్ కధలు సాగుతున్న ఈ సమయంలో మళ్ళీ అడివి శేష్కి ఈ జానర్ లో ఇది మూడో సినిమా. పీవిపీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం ఏ మేరకు అంచనాలు అందుకుంటుందో వేచి చూద్దాం.