సమంత యశోద సినిమా రన్ టైం లాక్.. సినిమా నిడివి ఎంతంటే?

సమంత విడాకులు తీసుకున్న తర్వాత విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్థాయిలో లేడీ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిన సినిమా యశోద. ఈ సినిమా హరి హరీష్ దర్శకత్వంలో తెరకెక్కి నవంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలకు సమంత దూరమైనప్పటికీ వరలక్ష్మి శరత్ కుమార్ ఇతర చిత్ర బృందం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

ఇకపోతే సమంత అనారోగ్య సమస్య కారణంగా ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసినటువంటి టీజర్స్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమాలో సమంత యాక్షన్ సీక్వెన్సెస్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమా తప్పకుండా సమంతకు ప్లస్ పాయింట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే సెన్సార్ సభ్యులు ఈ సినిమాని వీక్షించిన అనంతరం సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇవ్వటమే కాకుండా ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా రన్ టైం కూడా లవ్ చేశారు. యాక్షన్ కిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని 135 నిమిషాల పాటు రన్ టైం లాక్ చేసినట్టు తెలుస్తుంది.ఇలా యాక్షన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఈ విధమైనటువంటి రన్ టైం ఫర్ఫెక్ట్ గా సరిపోయిందంటూ పలువురు సినీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.