పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం ‘వకీల్ సాబ్’ తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా మెప్పించిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు విజృంభిస్తున్నా ప్రేక్షకులు పెద్ద ఎత్తున సినిమా హాళ్ళకి పోటెత్తారు. పాండిమిక్ సమయంలో కూడ ఓపెనింగ్స్ పరంగా రికార్డ్ నెలకొల్పింది ఈ సినిమా. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటే మూడు వారాల్లో 110 కోట్ల టార్గెట్ రీచ్ అయ్యేదే. కానీ థియేటర్లు మూతబడటం, ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించడంతో వసూళ్లు రావాల్సిన స్థాయిలో రాలేదు. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు. కలెక్షన్స్ సంగతి పక్కనపెడితే చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు పొందింది.
ఈ 2021 మొదటి ఆరు నెలలకు గాను ఐఎండీబీ రెటింగ్స్ పరంగా తెలుగు సినిమాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆరంభంలో సినిమా హాళ్లు ఓపెన్ ఉన్నప్పుడు చిన్న పెద్ద అన్నీ కలిపి సుమారు 30కిపైగా సినిమాలు టాలీవుడ్లో విడుదలయ్యాయి. అన్నింటిలోకీ అత్యదిక రేటింగ్ సాధించింది ‘వకీల్ సాబ్’. దీంతో మరోసారి సినిమా జనాల్లోకి ఎంత బాగా వెళ్ళిందో అర్థమవుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. నిర్మాతగా మాత్రం ఆయన బాగానే లాభాలు చూశారు. ఈ చిత్రంతో పవన్ రీఎంట్రీ సంతృప్తికరంగానే జరిగింది.