మరో పాన్ ఇండియా సినిమాలో రష్మిక.. ఇది వేరే లెవల్

Rashmika gets another pan India movie offer
Rashmika gets another pan India movie offer
తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది రష్మిక మందన్న.  రెండు హిట్లు అందుకోగానే వెంటనే పెద్ద హీరోల సినిమాల్లో ఆమెకు ఆఫర్లు మొదలయ్యాయి.  ఏకంగా మహేష్ బాబుతోనే నటించేసి హాట్ షాట్ అయింది.  ఇంత వేగంగా స్టార్ హీరోయిన్ అవుతానని రష్మీక మందన్న కూడ ఊహించి ఉండదు.  కాలం కలిసొస్తే అంతే మరి.  ప్రజెంట్ ఆమె తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ చిత్రం చేస్తోంది.  ఇది రష్మిక చేస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం.  ఈ సినిమా గనుక హిట్ అయితే రష్మిక స్టార్ డమ్ అమాంతం పెరిగిపోతుంది. 
 
దీంతోపాటు ఇంకొక పాన్ ఇండియా సినిమాలో కూడ రష్మిక నటిస్తున్నట్టు చెబుతున్నారు.  ఆ చిత్రం మరేదో కాదు శంకర్, రామ్ చరణ్ ప్రాజెక్ట్.   ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.  శంకర్ సినిమాల్లో హీరోయిన్ అంటే మామూలు మాటలు కాదు.  ఒక హీరోయిన్ స్టార్ అయింది అనడానికి శంకర్ సినిమాలు ఒక ట్రేడ్ మార్క్ లాంటివి.  కథలో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యతతో పాటు ఎలివేషన్ కూడ ఇస్తారు ఆయన.  ఆయన సినిమాలో చేసిన చాలామంది హీరోయిన్స్ తారాస్థాయి కెరీర్ చూసినవాళ్లే.  ఒకవేళ ఈ వార్తే గనుక నిజం అయితే రష్మిక కెరీర్ వేరే లెవల్ కి చేరడం ఖాయం.