రేసింగ్ మత్తులో దొరికిన దుల్కర్, పృథ్వీరాజ్
సెలబ్రిటీలు పది మందికి ఆదర్శం అని అంటారు. కానీ అలాంటి వాళ్లే తప్పుడు పనులకు దిగితే ఇంకేమైనా ఉందా? దానినే ఆదర్శంగా తీసుకుని యువతరం నాశనమైతే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు. జనం తిరిగే రోడ్లలో రేసింగుకి వెళ్లడాలు.. లగ్జరీ కార్లు కొని తక్కువ రేటు చూపించి పన్ను ఎగ్గొట్టడం వగైరా వగైరా పనులకు సెలబ్రిటీలే తెర తీస్తే సరైనదేనా?
ఆ ఇద్దరు స్టార్ హీరోలు అలాంటి తప్పులే చేసి దొరికిపోయారు. మలయాళ యువహీరో దుల్కార్ సల్మాన్.. ఆయన కొలీగ్ అయిన పృథ్వీరాజ్ ఇద్దరిపైనా కేరళ ఆర్టీఏ కేసులు బుక్ చేసేందుకు రెడీ అవుతోంది. ఆ ఇద్దరూ రేసింగ్ మత్తులో మునిగారని కొట్టాయం-కొచ్చి రహదారిలో కార్ రేసింగుకి వెళ్లారని ప్రూఫ్ దొరకడంతో ఇద్దరిపైనా దర్యాప్తు సాగుతోంది. సోషల్ మీడియాల్లో దొరికిన వీడియో ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును ఆర్టీఏ వాళ్లు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ వీడియోని ఆ ఇద్దరి కార్లను వెంబడించిన ఇద్దరు కుర్రాళ్లు అప్ లోడ్ చేయడంతో నానా రచ్చ చేసింది సోషల్ మీడియాల్లో. ప్రస్తుతం కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తప్పు చేస్తే ఆ ఇద్దరు హీరోలకు నోటీసులు పంపిస్తామని ఆర్టీఏ వాళ్లు చెబుతున్నారు.
వీళ్లు దోషులు అని తేలితే సెక్షన్ 184 ప్రకారం కారు యజమానులకు జరిమానాలు విధిస్తారు. చెల్లించకపోతే ఆరు నెలలు జైలుకు పంపుతారు. ఇదొక్కటేనా అంటే.. ఇంతకుముందు స్టార్ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్ వేరొక చెత్త పని చేసి దొరికిపోయాడు. 2019 నవంబర్ లో పృథ్వీరాజ్ కొత్త లగ్జరీ కారు విలువ తగ్గించి పన్ను ఎగ్గొట్టాలని చూడడంతో ఎర్నాకులం ఆర్టీఏ రిజిస్టేషన్ ని నిరాకరించింది. దరఖాస్తులో సమర్పించిన కొనుగోలు బిల్లులో లగ్జరీ వాహనం విలువ రూ .1.34 కోట్లుగా ఉండగా.. వాహనం అసలు విలువ సుమారు రూ .1.64 కోట్లు అని అధికారులు గుర్తించారు.
https://www.youtube.com/watch?time_continue=21&v=o6KTdfDq4fg&feature=emb_title