బిగ్ మూమెంట్ : “సీతా రామం” చిత్రంపై పై ఉప రాష్ట్రపతి షాకింగ్ రివ్యూ..!

ఈ ఆగస్ట్ మొదటి వారంలో రిలీజ్ కి వచ్చినటువంటి చిత్రాల్లో రెండు కూడా హిట్ సినిమాలే వచ్చాయి. మరి ఒకటి నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన “బింబిసార” కాగా మరో చిత్రం మోలీవుడ్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన “సీతా రామం”.

ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకోవడంతో ట్రేడ్ వర్గాలు ఆనందం వ్యక్తం చేశారు. అయితే మరి ఇప్పటికీ బింబిసార కొద్దిగా స్లో అయినా సీతా రామం మాత్రం బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుంది. పైగా ఒక క్లాసికల్ లవ్ స్టోరీ కావడంతో ఏ సెంటర్ ఆడియెన్స్ కి ఈ సినిమా బాగా రీచ్ అయ్యింది.

అయితే ఈ రీచ్ ఎంత వరకు వెళ్ళింది అంటే ఏకంగా మన దేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ సినిమాపై తన రివ్యూ అందించారు. మరి ఈ సినిమా చూసాక తాను ఏమన్నారంటే..

“సీతారామం” చిత్రాన్ని వీక్షించాను. నటీనటులు అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమైంది. సాధారణ ప్రేమ కథలా కాకుండా, దానికి వీర సైనికుని నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ తప్పక చూడదగినది. చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూసిన అనుభూతిని “సీతారామం” అందించింది.

రణగొణధ్వనులు లేకుండా, కళ్ళకు హాయిగా ఉండే ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ చిత్ర దర్శకుడు శ్రీ హను రాఘవపూడి, నిర్మాత శ్రీ అశ్వినీదత్, స్వప్న మూవీ మేకర్స్ సహా చిత్ర బృందానికి అభినందనలు.” అని తెలియజేయడం ఈ సినిమాకి అలాగే చిత్ర యూనిట్ కి ఒక బిగ్ మూమెంట్ గా మారింది. మొత్తానికి అయితే ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయి రీచ్ కి చేరుకుంటుంది అని చెప్పాలి.