`గీత‌గోవిందం` అంతా హుళ‌క్కేనా?

(ధ్యాన్)
 
`గీత గోవిందం` ఇంత పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని ముందే ఊహించి ఉంటే సినిమాను అమ్మ‌క‌పోయేవాడిని… నేనే ఉంచుకునేవాడిని అని ఈ మ‌ధ్య ఆ చిత్ర నిర్మాత బ‌న్నీ వాస్ అన్నారు. ఇందులో నిజ‌మెంత‌?  నిజంగానే ఈ సినిమా స‌క్సెస్‌ను ముందే ఊహించ‌లేదా? అనేది ఇప్పుడు జ‌రుగుతున్న హాట్ టాపిక్‌.
 
సినిమా స‌క్సెస్ అవుతుంద‌ని తెలిసే స‌న్నిహితుల చేతుల్లో పెట్టార‌ట వాస్‌. `గీత‌గోవిందం`ను కొన్నారని వ‌స్తున్న పేర్ల‌లో స‌గం పేర్లు బినామీ అని టాక్‌. ఇందులో నిజానిజాలు ఏమిట‌న్న‌ది ఆ సంస్థే చెప్పాలి. మ‌రోవైపు సినిమా హిట్ ప‌ట్ల మెగా కుటుంబం పిచ్చ హ్యాపీగా ఉంది. టీమ్ అంద‌రికీ హీరో అల్లు అర్జున్ విందు కూడా ఇచ్చారు.
 
బ‌న్నీ లుక్ అదేనా?
అయితే ఈ పార్టీ మొత్తం బ‌న్నీ క్యాప్ పెట్టుకునే ఉన్నారు. అలా ఎందుకు ఉన్నారు? బ‌న్నీ హెయిర్ స్టైల్ ఏమైనా కొత్త‌గా ఉందా?  దాన్ని బ‌య‌ట‌పెట్ట‌డం ఇష్టం లేక అలా ఉన్నారా?  ఫొటోల‌కు ఎప్పుడూ నేరుగా ఫోజులిచ్చే ఆయ‌న ఎందుకు త‌ల‌ను ప‌క్క‌కు వాల్చి… స‌గం క్యాప్‌ని క‌ప్పిన‌ట్టు నిలుచున్నారు? వ‌ంటివ‌న్నీ నెటిజ‌న్ల‌కు క‌లుగుతున్న అనుమానాలు.