కార్తికేయ పూజ వివాహం ఎక్కడో తెలుసా?

నిర్మాత దర్శకుడు వి.బి  రాజేంద్ర ప్రసాద్ మనవరాలు, నిర్మాత  రామ్  ప్రసాద్ రెండవ కుమార్తె  పూజా ప్రసాద్ కు,  దర్శకుడు పద్మశ్రీ  ఎస్ ఎస్  రాజమౌళి కుమారుడు కార్తికేయ  నిశ్చితార్థం  ఇంతక ముందు హైద్రాబాద్లో అతి సన్నిహితుల మధ్య జరిగింది. ఇక  వివాహం డిసెంబర్ 30న జైపూర్లోని ఓ హోటల్లో జరుగుతుంది. ఈ విహాహానికి ఇరు కుటుంబాల సన్నిహితులు మాత్రం హాజరయ్యే అవకాశం వుంది. జైపూర్ లో వివాహాన్ని
రాంప్రసాద్, శ్రీమతి శోభా ప్రసాద్ కుటుంబం నిర్వహిస్తుంది. హైద్రాబాద్లో వివాహం జరపాలంటే రాజమౌళికి  వున్న సర్కిల్  అందరినీ పిలవాలి, అలాంటి వివాహాన్ని జరపడం చాలా కష్టమై పోతుందనే  ఉద్దేశ్యంతోనే  వివాహం జైపూర్లో జరపడానికి  నిర్ణయించారు. పూజా ప్రసాద్ కుటుంబ వివాహాన్ని జరిపించడాని ఏర్పాట్లు ప్రారంభించింది.

ఇక వివాహ రిసెప్షన్ మాత్రం రాజమౌళి, శ్రీమతి రమా రాజమౌళి కుటుంబం నిర్వహిస్తుంది. జనవరి 5న ఈ కార్యక్రమం నానక్ రామ్ గూడలోని రామానాయుడు  స్టూడియోస్ లో జరుగుతుందని సన్నిహితుల  ద్వారా  తెలిసింది. ఇక ఈ వివాహానికి ఇరు  కుటుంబాల నుంచి 1000 మంది వరకు అతిధులు హాజరవుతారని  తెలుస్తుంది. కార్తికేయ తండ్రివారసత్వం స్ఫూర్తిగా తీసుకొని దర్శకత్వ శాఖలో కొనసాగుతున్నాడు. పూజా ప్రసాద్ శాస్త్రీయ  సంగీతం నేర్చుకొని కొన్ని ఆల్బమ్ లు తెచ్చింది. అయితే పూజ ప్రస్తుతం పెయింటింగ్ చేస్తుంది.