అమెరికాలో తెలుగు విద్యార్థులు మోసపోతున్నారా? అంటే అవుననే ఫిలింసర్కిల్స్ లో చర్చ సాగుతోంది. అది కూడా అమెరికాలో ఒక సినిమా డిస్ట్రిబ్యూటర్ వల్ల విద్యార్థులు మోసపోతున్నారని తెలుస్తోంది. అమెరికా విద్య పేరుతో ఈ తరహా మోసానికి పాల్పడుతున్న ఓ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ ని యుఎస్.ఏ – టెక్సాస్ పోలీసులు అరెస్ట్ చేయడంతో అసలు గుట్టు రట్టయ్యింది.
ఓవైపు అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో ఇప్పటికే తెలుగు విద్యార్థులంతా బెంబేలెత్తే పరిస్థితి తలెత్తింది. అమెరికా ఉద్యోగాలకు విదేశీయులకు వీసా వెసులు బాటు లేకుండా కట్టడి చేయడంతో ఇప్పుడు దొడ్డి దారులు వెతుక్కునే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఇలాంటి క్లిష్ఠ సమయంలో ఎడ్యుకేషన్ పేరుతో మోసాలు వెలుగు చూస్తున్నాయి.
అదే క్రమంలో అమెరికాలో మాస్టార్స్ పేరుతో మోసాలు ఎక్కువయ్యాయట. ఆన్ లైన్ ప్రకటనలు నమ్మొద్దు. ఎవరూ ఇలాంటివి గుడ్డిగా నమ్మొద్దని అమెరికా పోలీసులు హెచ్చరిస్తున్నారు. నేను ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ ని అని చెప్పుకుంటూ ఓ పెద్దాయన కొందరు విద్యార్థుల్ని ఇలానే మోసం చేయడంతో ఆందోళన నెలకొంది. ఒకవేళ విద్యార్థులు ఎవరైనా అమెరికాలో మాస్టర్స్ చేయదలిస్తే ముందుగా అధికారిక సోర్స్ ద్వారా తెలుసువాలని సూచిస్తున్నారు. ఈ దందాకు తెరతీసిన అమెరికా డిస్ట్రిబ్యూటర్ ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది.