ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ పేరు, అడ్రస్ మార్చుకోవాలా.. పాటించాల్సిన అద్భుతమైన చిట్కాలివే!

మనలో ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ కచ్చితంగా ఉంటుందని చెప్పాల్సిన అవసరం లేదు. గ్యాస్ ధరలు పెరిగినా తగ్గినా కొనుగోలు చేయక తప్పదని చెప్పవచ్చు. గ్యాస్ కనెక్షన్ ను ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డ్ తో లింక్ చేసుకుని ఉంటారు. గ్యాస్ కనెక్షన్ ను ఒకరి పేరు నుంచి మరొకరి పేరుకు మార్చుకోవడానికి కొంతమంది ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ ను ఒకరి పేరు నుంచి మరొకరి పేరుకు మార్చుకోవచ్చు.

కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలని భావించే వాళ్లు సులువుగానే కొత్త గ్యాస్ కనెక్షన్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇల్లు మారిన సమయంలో గ్యాస్ కనెక్షన్ ను తప్పనిసరిగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. ఎవరి పేరుపై గ్యాస్ కనెక్షన్ ను మార్చాలని అనుకుంటున్నారో వారి యొక్క కేవైసీ వివరాలు, ధ్రువీకరణ పత్రం, అడ్రస్ ప్రూఫ్లతో పాటు ఒరిజినల్ సబ్‌స్క్రిప్షన్ వోచర్, ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న వ్యక్తి డిక్లరేషన్ ఫామ్ లను సమర్పించాలి.

వీటితో పాటు డిస్ట్రిబ్యూటర్‌కు ట్రాన్స్‌ఫర్ దరఖాస్తును అందిస్తే మంచిది. కేవైసీ వివరాలను వెరిఫై చేసి డిస్ట్రిబ్యూటర్ నుంచి కొత్త సబ్‌స్క్రిప్షన్ వోచర్ ను పొందే అవకాశం ఉంటుంది. ఎల్‌పీజీ కనెక్షన్ హోల్డర్ చనిపోతే మాత్రం వారసులు సరైన ఆధారాలను సమర్పించి గ్యాస్ కనెక్షన్ పేరును మార్చుకునే అవకాశం అయితే ఉంది. గ్యాస్ కనెక్షన్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

గ్యాస్ కనెక్షన్ అడ్రస్ ను మార్చుకోని పక్షంగా గ్యాస్ సిలిండర్లను పొందడానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సమీపంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ ను సంప్రదించడం ద్వారా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.