హరిప్రసాద్ జక్కా – శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ ‘ప్లే బ్యాక్’

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమాకు స్క్రిప్ట్, నాగచైతన్య 100% లవ్ సినిమాకు స్క్రీన్ ప్లే అందించి గుర్తింపు తెచ్చుకున్నారు హరిప్రసాద్ జక్కా. ‘దర్శకుడు’ సినిమాతో దర్శకుడిగా కూడా మారారు ఈయన. తాజాగా ఆయన రెండవ సినిమా టైటిల్ ప్రకటించారు. ‘ప్లేబ్యాక్’ అనే టైటిల్ దీనికి ఖరారు చేశారు దర్శకుడు.

మర్డర్ మిస్టరీగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్ లో 1993 మరియు 2019 లైన్స్ ఉన్నాయి. హుషారు ఫేమ్ దినేష్ తేజ్, మల్లేశం ఫేమ్ అనన్య ఇందులో జంటగా నటిస్తున్నారు. ఆగస్టు 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఒకే షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. కె బుజ్జి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్
బ్యానర్ పై PNK ప్రసాద్ రావు ‘ప్లేబ్యాక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నటీనటులు:
దినేష్ తేజ్, అనన్య, అర్జున్ కళ్యాణ్, మారుతి, టిఎన్ఆర్, స్పందన పల్లి తదితరులు