పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ. మహేష్, ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీ. మరి అలాంటప్పుడు ఆ ముగ్గురితో హరీష్ శంకర్ కి అవకాశం దక్కుతుందా? ఆయన గబ్బర్ సింగ్ 3 తీయాలని కోరుకోమంటున్నాడు. అయినా ఆ పిలుపు పవన్ కి వినిపించే ఛాన్సే లేదు. జనసేనానిగా ఆయన రాజకీయాలకే అంకితమైపోయారు. మరోవైపు మహేష్ క్యూలో వరుసగా క్రేజీ డైరెక్టర్లు ఉన్నారు. ఇప్పుడు పని చేస్తున్న అనీల్ రావిపూడికే ఇంకో సినిమా కమిటయ్యాడు మహేష్. ఇక ప్రభాస్ సీన్ వేరేగా ఉంది. అటు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఇటు పూరి జగన్నాథ్ సైతం క్యూలోకొచ్చారు. రాధాకృష్ణతో జాన్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆ ముగ్గురు స్టార్లతో పని చేసే వీలుంటే అస్సలు విడిచిపెట్టనని హరీష్ శంకర్ అన్నాడు. పవన్ తో గబ్బర్ సింగ్ 3 పుకార్ పై.. మీరేమంటారు? అన్నదానికి అలా జరగాలని మీరు కోరుకోండి. నేను కూడా పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ చిత్రం చేయాలనీ ఎంతగానో కోరుకుంటా
అన్నారు. టాలీవుడ్ లో ఎవరికైనా రుణపడ్డానని అనిపించిందా? అంటే.. ఎన్టీఆర్ గారికి చాలా ఋణ పడివున్నాను. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. ఎప్పటికైనా ఆయనతో మంచి హిట్ మూవీ తీసి ఋణం తీర్చుకోవాలి అని అన్నాడు. డార్లింగ్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నారా? అంటే.. ప్రభాస్, మహేష్ లాంటి హీరోలతో అవకాశం వస్తే వద్దంటానా? అభిమానులు అడుగుతుంటారు. కానీ బాహుబలి రేంజు చేయాలని అనుకుంటే కుదరదు. దానంతటదే కుదరాలి.. అంటూ నిర్వేదం వ్యక్తం చేశాడు. ఇప్పుడున్న ఠఫ్ కాంపిటీషన్ లో హరీష్ శంకర్ కోరిక నెరవేరుతుందా? అంటే సందేహమే. కనీసం గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు హరీష్ కోసం పవన్ వచ్చి గబ్బర్ సింగ్ సీక్వెల్ లో నటిస్తాడా అంటే కుదిరేలా లేదు.