తిరుపతి ఉపఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికలను బీజేపీతో ఇతర పార్టీలు సైతం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపుకోసం పోరాడాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు ఉంటే తప్పా తిరుపతిలో గౌరవ ప్రదమైన ఓట్లను తాము దక్కించుకోలేమని బీజేపీ నేతలందరూ ఒక అభిప్రాయానికి వచ్చారు. దీంతో తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి రావాలంటూ పవన్ కల్యాణ్ ను బీజేపీ నేతలు కోరుతున్నారు. తాను ప్రచారానికి రావాలంటే.. బీజేపీ ఏం చేయాలన్నది కొన్ని షరతులు పెట్టినట్లు సమాచారం. అయతే ఆ షరతులు బీజేపీ ప్రయోజనాలకోసమే అన్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయం బీజేపీ నేతలకు అర్థం కావడం లేదు.
పవన్ కల్యాన్ మనసులో ఏదో పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడా..? లేదా మరేమైన అంశాలు ఉన్నాయా అన్న కోణంలో బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, స్మృతి ఇరానీ, నడ్డా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తదితరులు తిరుపతికి వస్తే.. తాను కూడా ప్రచారం చేస్తానని పవన్ కల్యాణ్ షరతులు పెట్టినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకే బీజేపీ అగ్రనేతలు వచ్చినప్పుడు తిరుపతికి మత్రం ఎందుకు రారని, బీజేపీ గెలుపు కోసం రావాలని పవన్ అంటున్నారు. నిజంగా తిరుపతి ఉప ఎన్నికను బీజేపీ సీరియస్ గా తీసుకుంటే.. అగ్రనేతలందరినీ తప్పిస్తామని ఎందుకు చెప్పడం లేదని పవన్ ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, స్మృతి ఇరానీ, నడ్డా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తదితరులు తిరుపతికి వస్తే.. తాను కూడా ప్రచారం చేస్తానని పవన్ కల్యాణ్ షరతులు పెట్టినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకే బీజేపీ అగ్రనేతలు వచ్చినప్పుడు తిరుపతికి మత్రం ఎందుకు రారని, బీజేపీ గెలుపు కోసం రావాలని పవన్ అంటున్నారు. నిజంగా తిరుపతి ఉప ఎన్నికను బీజేపీ సీరియస్ గా తీసుకుంటే.. అగ్రనేతలందరినీ తప్పిస్తామని ఎందుకు చెప్పడం లేదని పవన్ ప్రశ్నిస్తున్నారు.