బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన వకీల్ సాబ్ !

No change in Pawan's craze

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి సినిమా వస్తుందంటే అభిమానులకు పెద్ద పండగే. సినిమా ఎలా ఉందనేది పక్కన పెట్టి ఫస్ట్ డే రికార్డ్స్ బ్రేక్ చేయడం కోసం చూస్తారు. అలాంటిది ఇప్పుడు చాల గ్యాప్ తర్వాత పవన్ నుండి సినిమా వస్తుండడం తో ఇంకాస్త క్రేజ్ మొదలైంది. వకీల్ సాబ్ తో పవన్ చిత్రసీమ కు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 09 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 

బాలీవుడ్ సూపర్ హిట్ ఫిలిం పింక్ చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలే పెట్టుకున్నారు. వేణు శ్రీ రామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ని దిల్ రాజు- బోనీకపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ ట్రైలర్ ప్రస్తుతం ఇది యూ ట్యూబ్‌లో సంచలనాలు రేపుతుంది.

ఊహించినట్లుగా ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. తక్కువ టైంలో అత్యధిక లైక్స్ సాధించిన ట్రైలర్‌గా ‘బాహుబలి 2’ ఉండేది. కానీ వకీల్ సాబ్ దానిని బ్రేక్ చేసాడు. బాహుబలి 2 ట్రైలర్ 4 లక్షల లైకులు సంపాదించడానికి 10 గంటల సమయం పట్టింది. కానీ దాన్ని పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం 71 నిమిషాల్లో చేసి చూపించాడు. 7 లక్షల లైక్స్ 250 నిముషాల్లో పూర్తి చేసాడు పవర్ స్టార్. మరి ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో చూడాలి. ప్రస్తుతం ఈ ట్రైలర్ కి 8 లక్షల 25 వేల లైక్స్ వచ్చాయి. త్వరలోనే 1 మిలియన్ లైక్స్ పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.

Vakeel Saab Trailer - Pawan Kalyan | Sriram Venu | Thaman S |  #VakeelSaabOnApril9th