దిల్ రాజు బ్యానర్ లో మెగాస్టార్

ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు, యంగ్ హీరోలంద‌రితోనూ సినిమాలు తీశారు. అయినా మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాల‌ని దిల్ రాజుకు ఎప్ప‌టి నుంచో ఒక క‌ల ఉండేది. అయితే.. అది ఇప్పుడు నెర‌వేర‌బోతున్న‌ట్లు తెలిసింది. టాలీవుడ్‌లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇటీవ‌లే చిరంజీవిని దిల్ రాజు క‌లిశార‌ని, ఆయ‌న‌తో సినిమా చేయాల‌నుకుంటున్న విష‌యాన్ని దిల్‌రాజు చెప్పార‌ని, దీంతో దిల్‌రాజు కోరిక‌ను చిరంజీవి అంగీక‌రించార‌ని తెలుస్తోంది. దిల్ రాజు అడ‌గ్గానే చిరంజీవి సినిమా తీసేందుకు ఒప్పుకున్నార‌ట‌. దీంతో చిరంజీవి త‌రువాతి సినిమా (153వ సినిమా)ను దిల్ రాజు నిర్మిస్తార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే దీనిపై అటు మెగా వ‌ర్గంతోపాటు ఇటు దిల్‌రాజు కూడా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా వెలువ‌రించ‌లేదు. కాగా ప్ర‌స్తుతం చిరంజీవి సైరా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు.

సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. రామ్ చ‌రణ్ ఈ మూవీకి నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ మూవీ అక్టోబ‌ర్ 2వ తేదీన గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే సైరా మూవీ త‌రువాత కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో చిరంజీవి 152వ సినిమా చేయనున్నారు. ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఆ త‌రువాతే చిరంజీవి దిల్ రాజుతో మూవీ చేస్తార‌ని తెలుస్తోంది. ఇక ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త రావాలంటే మ‌రికొద్ది రోజుల పాటు వేచి చూడ‌క త‌ప్ప‌దు