విజయ్ దేవరకొండ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. పట్టిందల్లా బంగరామే అవుతోంది. ఇటీవలే డియర్ కామ్రేడ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. డివైడ్ టాక్ వచ్చినా,రివ్యూలు అనుకూలంగా లేకపోయినా విజయ్ ఇమేజ్ తో పెద్దగా మార్పు లేదు. బాక్సాఫీస్ వద్ద తుది ఫలితం ఎలా విజయ్ కెరీర్ పై ఈసినిమా పెద్దగా ప్రభావం చూపిస్తుంది అనేది తెలియదు. ప్రస్తుతం చేతిలో రెండు, మూడు సినిమాలున్నాయి. అయితే ఈ నయా స్టార్ దిల్ రాజు ను లెక్క చేయడం లేదన్న ఓ రూమర్ ఫిలిం సర్కిల్స్ లో చర్చకొచ్చింది.
ఇటీవలే దిల్ రాజు దేవరకొండతో సినిమా చేద్దామని అడిగాడుట. ఆ సయమయంలో దేవరకొండ నోట చేద్దాం…చూద్దాం అనే అశ్రద్ద మాటలొచ్చాయి. దీంతో దిల్ రాజు దేవరకొండ ని కింద నుంచి పైకి వరకూ ఓ లుక్ వేసి మారు మాట్లాడకుంటా అక్కడ నుంచి వచ్చేసాడుట. దిల్ రాజుతో సినిమా అంటే విజయ్ రేంజ్ స్టార్ మిస్ చేసుకోడు. పెద్ద ప్రొడక్షన్ కంపెనీ. పారితోషికం దండీగా ఇస్తాడు. సక్సెస్ అయితే అదనంగా బహుమతులుంటాయి. కానీ దేవరకొండ ఇవన్నీ వదులకున్నాడు. దీంతో దిల్ రాజ్ తో ఎందుకలా మాట్లాడడని ఆరా తీయగా కొన్ని స్పెక్యులేషన్స్ వైరల్ అవుతున్నాయి.