డియర్ కామ్రేడ్ తొలిరోజు వసూళ్లు
విజయ్ దేవరకొండ- రష్మిక జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రి సంస్థ నిర్మించిన `డియర్ కామ్రేడ్` అంచనాలకు తగ్గట్టే ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల వసూళ్లు సాధించింది. దేవరకొండ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ఇది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి రోజు 7.49 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయగా నైజాం నుంచి 3.02 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. కామ్రేడ్ తొలిరోజు వసూళ్లు పరిశీలిస్తే..
నైజాంలో 3.02 కోట్లు, సీడెడ్‌లో 0.88 కోట్లు, నెల్లూరు 0.26 కోట్లు, గుంటూరు 62.50 లక్షలు, కృష్ణా 0.38 కోట్లు, వెస్ట్ గోదావరి 53.25 లక్షలు, తూర్పు గోదావరి 0.90 కోట్లు, ఉత్తరాంధ్రలో 88.72 లక్షల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఆంధ్రా – తెలంగాణ కలుపుకుని 6.70 కోట్లు వసూలైంది. కర్నాటక -65లక్షలు, తమిళనాడు-31లక్షలు, కేరళ-12 లక్షలు, ఇతర భారతదేశం -15లక్షలు, ఓవర్సీస్-1.75కోట్లు వసూలైంది. దేవరకొండ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ఇది. అలాగే తొలి మూడు నాలుగు రోజుల వసూళ్లకు డోఖా ఉండదని తాజా సీన్ చెబుతోంది. ఇక క్రిటిక్స్ నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగులు సాధిస్తోంది ఈ చిత్రం. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రూ. 22 కోట్ల మేర బిజినెస్ చేయగా..ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 34 కోట్లకు విక్రయించారు. 34 కోట్ల షేర్ వసూలు చేస్తే హిట్టయినట్టే.