నేచురల్ బ్యూటీపై భామల క్లాస్ బావుందే
అందం అనేది ఆకారానికి సంబంధించినది కాదు… మనసుకు సంబంధించినది.. అంటూ ఇంతకుముందు చందమామ కాజల్ అభిమానులకు సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకోసం అసలు ఏ మేకప్ లేకుండా తాను ఎలా ఉంటుందో ఒరిజినల్ రూపాన్ని ప్రదర్శించింది. అసలు కాజల్ ఒరిజినాలిటీ ఇదా అంటూ షాక్ కి గురయ్యారంతా. అయితే ఆ ఫోటోషూట్ చేసేందుకు కాజల్ ప్రదర్శించిన గట్స్ ని ప్రశంసించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. కాజల్ డేరింగ్ యాటిట్యూడ్ ని అంతా ప్రశంసించారు.
ఇప్పుడు ఇంచుమించు అదే తీరుగా బాలీవుడ్ కథానాయిక జరీన్ ఖాన్ తన నేచురల్ అందాన్ని ఎగ్జిబిట్ చేయడం చర్చకు వచ్చింది. అయితే ఆ ఫోటోలపై నెటిజనుల కామెంట్లకు అంతే సహనంగా సమాధానం ఇవ్వడం స్ఫూర్తినిస్తోంది. జరీన్ ఖాన్ రాజస్థాన్ లో ఓ ఫోటోషూట్ లో పాల్గొంది. ఆ ఫోటోల్ని ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసింది. తెల్లని టీషర్ట్ బ్లూ జీన్స్ లో కనిపించిన జరైన్ పొట్టభాగం ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆ పొట్టపై మడతలు పడి ఉండడంపై రకరకాల కామెంట్లు చేశారు నెటిజనులు. ఆ ఉదర భాగంపై కుట్లు వేయించుకున్నావా? శస్త్ర చికిత్స చేశారా? అయినా అంత లావు అవ్వడం ఎందుకు? అంటూ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసారు యూత్. అయితే ఈ వ్యాఖ్యలకు జరీన్ ఏమాత్రం కోపగించుకోకుండా ఎంతో శాంతంగా స్పందించింది.
నేచురల్ గా ఉండేందుకే నేను ఇష్టపడతాను. అయినా నేను 50కేజీల బరువు తగ్గాను. అందుకే నా పొట్ట భాగం అలా కనిపిస్తుంది. అలా ఉంది కదా అని ఫోటోషాప్ చేయించుకుని ఆ ఫోటోల్ని మీకు చూపించను. ఒరిజినల్ రూపం చూపించేందుకే ఇష్టపడతాను.. అని తెలిపింది. కత్రినకు అచ్చం డూప్ లా ఉండే జరీన్ ఖాన్ ని సల్మాన్ ఖాన్ `వీర్` అనే చిత్రంతో తెరకు పరిచయం చేశారు. `రెడీ` అనే చిత్రంలోనూ నాయికగా నటించింది. అక్షయ్, రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్న భారీ మల్టీస్టారర్ హౌస్ ఫుల్ 4లోనూ నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరో గోపిచంద్ సరసన చాణక్య చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. దీంతో ఇటు టాలీవుడ్ లోనూ అమ్మడి ఎంట్రీ అధికారికంగా ఖాయమైంది.