ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కులాల ప్రసక్తి తీసుకువస్తున్నారు. తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఆపేసిన దగ్గర నుంచి ఆయనలో కమ్మ కులంపై వ్యతిరేకత పెరగిపోయింది. చంద్రబాబుని , ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వరస పోస్ట్ లు పెడుతున్నారు.
అక్కడితో ఆగకుండా రీసెంట్ గా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. కులాల్ని బేస్ చేసుకుని ఉండనున్న ఈ ప్రాజెక్ట్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కొందరైతే వర్మను ఫోన్ ద్వారా బెదిరిస్తున్నారట. ఈ బెదింపుల గురించి మాట్లాడిన వర్మ వాట్సాల్ప్ గ్రూపుల వెనుక, లతివియా లాంటి పనికిమాలిన దేశాల సిమ్ కార్డుల వెనక దాక్కుని బెదిరించే కమ్మోళ్ళు,నాకు ఈగలతో సమానం. దమ్ముంటే కనీసం కుక్కలై అరవండి. అంతేకాని దోమల్లా గీ పెట్టకండి అంటూ సంచలన ట్వీట్ చేసి కొత్త వివాదనికి తేరా లేపారు వర్మ.
అయితే ఆ వివాదం ఆగేటట్లు కనపడటం లేదు. ఈ కామెంట్ కు వరసపెట్టి రిప్లైలు వస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు మండిపడుతున్నారు. కావాలని కులాల మధ్య చిచ్చు రేపుతున్నారని ఆయన్ని తిట్టిపోస్తున్నారు. అలాగే రక్త చరిత్ర-2 స్క్రిప్టు మార్చమని వార్నింగ్ ఇచ్చిన జగన్ రెడ్డి దేనితో సమానం రాజా?
కమ్మోళ్లు ఈగలైతే..మరి రెడ్లు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. అక్కడితో ఆగకుండా నీకు సినిమా జీవితం కెరీర్ ఇచ్చింది మా కమ్మోళ్లు కదా అని ప్రశ్నిస్తున్నారు. మరి వీటికి వర్మ ఏం జవాబు ఇస్తారో చూడాలి.