మాస్ హీరోకి క‌రోనా అంటుకుందా..?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా బీభ‌త్సం సృష్టిస్తూ.. రోజురోజుకీ ఊహించ‌ని విధంగా తీవ్ర‌స్థాయికి చేరుకుంటుంది. సామాన్య‌లు, ప్ర‌జాప్ర‌తిన‌ధులు, సెల‌బ్రిటీలు, ఇలా ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌డంలేదు క‌రోనా. ఇక ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌కు క‌రోనా సోకిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల అమితాబ్ బ‌చ్చ‌న్ ఫ్యామిలీ క‌రోనా బారిన ప‌డినం సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా క‌రోనా లిస్ట్‌లో ప్ర‌ముఖ సినీ హీరో చేరిపోయాడు. అవును త‌న‌కు కరోనా సోకింద‌ని మాస్ హీరో విశాల్ స్వ‌యంగా దృవీక‌రించారు. మొద‌ట విశాల్ నాన్నకు కరోనా పాజిటివ్ అని తేలగా, ఆయనకు సహాయం చేసే నేప‌ధ్యంలో విశాల్‌కు కూడా క‌రోనా అంటుకుంద‌ని, స్వ‌యంగా ఈ హీరోనే బ‌య‌ట‌పెట్టారు.

త‌న‌కు జ్వరం, జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని, అలాగే ఇవే లక్షణాలు తన మేనేజర్‌లో కూడా ఉన్నాయని విశాల్ తెలిపారు. దీంతో ముందు జాగ్ర‌త్త‌గా చికిత్స తీసుకున్నామ‌ని, దీంతో ప్ర‌స్తుతం తామంతా క‌రోనా నుండి కోలుకున్నామ‌ని విశాల్ తెలిపారు. తామంతా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడి వారంలోనే కోలుకున్నామ‌న్నారు.

ప్ర‌స్తుతం విశాల్, ఆయ‌న తండ్రి, మేనేజ‌ర్ ఆరోగ్యంగా ఉన్నామ‌ని, క‌రోనా నుండి పూర్తిగా బ‌య‌ట‌ప‌డ్డామ‌ని విశాల్ తెలియ‌జేశారు. అయితే విశాల్‌కు కరోనా సోకిందనే విషయం తెలిసి కోలీవుడ్‌లో కొంద‌రు షాక్‌కు గుర‌య్యారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల విశాల్‌త‌తో కాంటాక్ట్ లోకి వెళ్లిన వాళ్లంతా క్వారంటైన్ లోకి వెళ్లార‌ని స‌మాచారం. ఇక ప్ర‌పంచ‌మంతా క‌రోనాకి మెడిసిన్ కోసం ఎదురు చూస్తుంటే.. ఆయుర్వేదిక్ మెడిసిన్‌తో తనకు కరోనా తగ్గిపోయిందన్న‌ విశాల్ వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది.