కలర్స్ స్వాతి పెళ్లి ఫిక్స్. వరుడు ఎవరంటే…

టెలివిజన్ ఛానల్ కలర్స్ ప్రోగ్రాం ద్వారా వీడియో జాకీగా మంచి గుర్తింపు పొందింది స్వాతి. ఆ తర్వాత డేంజర్, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే వంటి సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసింది ఈ నటి. తమిళ సినిమా సుబ్రమణ్యపురంలో హీరోయిన్ గా తొలిసారి నటించింది. తెలుగులో అష్టాచెమ్మా సినిమా ద్వారా హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఈ సినిమాలో తన నటనకి గాను ఫిల్మ్ ఫేర్ అవార్డు, నంది అవార్డులను దక్కించుకుంది. గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూ సెలెక్టివ్ గా సినిమాలలో నటిస్తున్న స్వాతి పెళ్లిపై చాలా గాసిప్స్ వచ్చాయి.

స్వాతి, వికాస్

తాజాగా ఆమె పెళ్లి ఫిక్స్ అయిందంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ఈ న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ అయింది. మలేషియన్ ఎయిర్ లైన్స్ లో పని చేస్తున్న వ్యక్తితో ఆమె పెళ్లి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇరు కుటుంబాలలోని పెద్దలను ఒప్పించి పెళ్ళికి రెడీ అయ్యారట. ఈ నెల 30 న పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టుకున్నారని సమాచారం. రిసెప్షన్ కూడా పెట్టుకోనున్నారని తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే స్వాతి అధికారికంగా వెల్లడించాలి.