” స్వాతి ” చినుకులా వచ్చి వెళ్ళిపోయింది.. ఫ్యాన్సేమో చచ్చిపోతున్నారట ..?

కలర్స్ అన్న టెలివిజన్ ప్రోగ్రాం తో బాగా పాపులారిటీ సంపాదించుకుంది స్వాతి. ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతున్నప్పటి నుంచే కలర్స్ స్వాతి అంటూ పిలిచేవారు. చెప్పాలంటే కొంతమంది ఇప్పుడు స్వాతి ఎక్కడ కనిపించినా కలర్స్ స్వాతి అనే పిలుస్తుంటారు. అయితే స్వాతి కేవలం యాంకర్ గానే కాదు హోస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.

Karthikeya Movie New Wallpapers | New Movie Posters

స్వాతి లో ఉన్న హైపర్ యాక్టివ్‌నెస్ చూసిన క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ఆయన దర్శకత్వం వహించిన డేంజర్ అన్న సినిమాలో మంచి రోల్ ఇచ్చాడు. ఈ సినిమా తో బాగానే పేరు తెచ్చుకున్న స్వాతి ఆ తర్వాత ఇంద్రగంటి మోహన కృష్ణ – నాని – అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అష్టా చమ్మా సినిమాతో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. అంతేకాదు ఈ సినిమాకి నంది అవార్డ్ కూడా అందుకుంది.

ఆ తర్వాత వరసగా త్రిపుర, అప్పల్రాజు, ఆడవారి మాటలకి అర్థాలే వేరులే, స్వామి రారా, కార్తికేయ లాంటి సినిమాలలో నటించింది. ముఖ్యంగా కార్తికేయ సినిమా స్వాతి కి హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ ని తీసుకు వచ్చింది. కాని ఆ తర్వాత ఎందుకనో స్వాతి టాలీవుడ్ లో అవకాశాలు అందుకోలేకపోయింది. కాని తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాలలో నటించిన స్వాతి మూడు ఇండస్ట్రీలలోను మంచి హిట్స్ అందుకుంది.

Actress Swathi Reddy & Her Super Cute Telugu Wedding | Telugu wedding,  Celebrity bride, Celebrity weddings

కాగా మళ్ళీ కార్తికేయ 2 తెరకెక్కుతున్న క్రమంలో స్వాతి మళ్ళీ ఈ సీక్వెల్ సినిమాలో కూడా నటించబోతుందన్న వార్తలు వచ్చాయి. కాని అఫీషియల్ గా మాత్రం ఎవరివైపు నుంచి కన్‌ఫర్మేషన్ రాలేదు. కాని ఫ్యాన్స్ మాత్రం స్వాతి ని మళ్ళీ సినిమాలలో నటిస్తే చూడాలనుకుంటున్నారు. మరి పెళ్ళి చేసుకున్న కారణంగానే స్వాతి సినిమాలకి దూరమైందా .. లేక అవకాశాలు లేకనా అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది.