ఆ సెక్స్ వీడియోలో ఉన్నది నేనే అనుకున్నారంతా

సినీ హీరోయిన్స్ ని మార్ఫింగ్ చేసి ఫోర్న్ వీడియోలు వదలటం చాలా కామన్ గా జరుగుతూంటుంది. వాటిపై హీరోయిన్స్ కంప్లైంట్ ఇచ్చి, వాటిని తీయించేలోపల..అవి వైరల్ అయ్యి, పాపులర అయ్యిపోతూంటాయి. ముఖ్యంగా వాట్సప్ ఇలాంటివాటికి వేదికగా ఉంటూ వస్తోంది. అయితే అవి చూసే వాళ్లు ఎంజాయ్ చేస్తారేమో కానీ ..ఆ మార్ఫింగ్ వీడియోల్లో ఉన్న హీరోయిన్స్ మాత్రం చాలా ఫీలవుతారు. అలా తాను చాలా బాధపడ్డానంటోంది కలర్స్ స్వాతి. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఆ ప్రస్దావన వచ్చే ఆ విషయం చెప్పింది.

స్వాతి మాట్లాడుతూ… “నేను కలర్స్ చేస్తున్నప్పుడు ఓ ఎమ్మెమ్మెస్ వచ్చింది. అందులో శృంగారం చేస్తున్న అమ్మాయికి కూడా పన్నుపై పన్ను ఉంది. దీంతో అందులో ఉన్నది నేనే అనుకున్నారంతా. సెట్స్ లో ఒకటే నవ్వులు, గుసగుసలు. ఆ సమయం లో చాలా బాధేసింది. ఇప్పటికీ క్యారెక్టర్ ను తక్కువ చేసి మాట్లాడితే తట్టుకోలేను.” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

స్వాతి అంటే కనుక్కోవటం కష్టం. కానీ కలర్స్ స్వాతి అంటే అందరికి సుపరిచితురాలే. బుల్లితెరపై కలర్స్ అనే కార్యక్రమంతో ప్రేక్షకులకు దగ్గరైన స్వాతికి ఆ పేరు ఇంటిపేరు అయిపోయింది. ఒక్క యాంకర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా, నటిగా కూడా తన ప్రతిభతో ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయింది.

కొంతకాలం క్రితం మలేషియన్ ఎయిర్ లైన్స్ పైలెట్ వికాస్ తో ఆమె వివాహం ఘనంగా జరిగింది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు పెద్దల అనుమతితో వివాహం చేసుకున్నారు. అయితే వివాహ వేడుక ముఖ్యమైన సన్నిహితుల సమక్షంలో జరుపుకున్నారు. స్వాతి.. అష్టాచమ్మా, స్వామిరారా, కార్తికేయ తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించారు. స్వాతి ప్రస్తుతం ఇండోనేషియాలో ఎంజాయ్ చేస్తోంది

ప్రస్తుతానికి సినిమాలు బై చెప్పేసిన స్వాతి, అతి త్వరలోనే రీఎంట్రీ ఇస్తానంటోంది. ఫ్యామిలీ లైఫ్ ను కొన్నాళ్లు ఎంజాయ్ చేసి, ఓ మంచి సినిమాతో రీఎంట్రీ ఇవ్వాలని అందంటూ తన మనసులో మాటను బయటపెట్టింది.