హరికృష్ణ మృతికి తెలంగాణ సిఎం కేసిఆర్ సంతాపం తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3గంటలకు హరికృష్ణ నివాసానికి వెళ్లి హరికృష్ణ పార్దీవ దేహానికి నివాళులు అర్పించారు. అక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను హత్తుకుని ఓదార్చారు. కళ్యాణ్ రామ్ ను కూడా ఓదార్చారు. ఎపి సిఎం చంద్రబాబుతో కొద్దిసేపు మాట్లాడారు. జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సిఎం కేసిఆర్ తో పాటు తెలంగాణ మంత్రులు కేటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.
హరికృష్ణ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కేసిఆర్ అధికారులను ఆదేశించారు. కుటుంబసభ్యులు ఎక్కడ అంత్యక్రియలు జరపుతామంటే అక్కడే ఏర్పాట్లు చేయాలన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సిఎస్ ఎస్ కె జోషిని కేసిఆర్ ఆదేశించారు.
కేసిఆర్ నివాళులు అర్పించిన వీడియో పైన ఉంది ఫొటోలు కింద ఉన్నాయి చూడండి.