ఆంధప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన 1000కి పైగా 104, 108 అంబులెన్స్ వాహనాలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం పచ్చ జెండా ఊపి ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో నత్తనడకన సాగిన సేవల్ని మళ్లీ ఊపందుకునేలా చేసారు. గత కాంట్రాక్ట్ బీవీజీని తప్పించి ఆ బాధ్యతలు అరబిందో కి అప్పగించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ఈ పథకానికి ప్రజల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తం అయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే వైఎస్సార్ తీసుకొచ్చిన ప్రభుత్వ అంబులెన్స్ సర్వీస్ ఓ సువర్ణధ్యాయంగా నిలిచిపోయింది. వైఎస్ ఆర్ ఒక అడుగు ముందుకేస్తే జగన్ రెండు అడుగులు ముందకేసి అధునాత సౌకర్యాలతో కూడిన కొత్త వాహనాలను శ్రీకారం చుట్టారు.
మండలానికి ఒక అంబులెన్స్ చొప్పున కేటాయించి మెరుగైన సేవల్ని అందించడానికి ప్రభుత్వం అన్ని రకాలు గా చర్యలు తీసుకుందని సీఎం తెలిపారు. అలాగే గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో నాట్కో క్యాన్సర్ బ్లాక్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం, జగన్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. తాజాగా ఈ సర్వీస్ ల పై టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సీఎంపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే జగన్ గారు 104, 108 అంబులెన్స్ లను ప్రారంభించారు. హేట్సాఫ్ జగన్ గారు. అంబులెన్స్ లను ఏపీలోని రూరల్ ఏరియా, అర్బన్ ఏరియాల్లో ఏర్పాటు చేసింనదుకు. ఏపీలో అత్యవసర సమయాల్లో ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని ట్వీట్ చేసారు. అన్నట్లు పూరి తమ్ముడు ఉమాశంకర్ గత ఎన్నికల్లో వైకాపా నుంచి నర్సీపట్నం ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే.
ఇంకా నిర్మాత బండ్ల గణేష్ కూడా ఈ సేవలపై హర్షం వ్యక్తం చేసారు. అయితే ఇటీవల జగన్ ని కలిసిన మిగతా పెద్దలెవరు కూడా ఈ విషయంపై స్పందించలేదు. ఇక మెగాస్టార్ చిరింజీవి జగన్ కి ఎప్పటికప్పుడు ఫోన్ టచ్ లో ఉంటారు. జగన్ పని తీరు, పథకాలపై ఆయన అభిప్రాయాల్ని వ్యక్తిగతంగా పంచుకుంటారని ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది.