రానాకు కిడ్నీ మార్పిడి ఆపరేషనా? అయితే ఇదెలా సాధ్యం

రానాకు కిడ్నీ మార్పిడి ఆపరేషనా? అయితే ఇదెలా సాధ్యం

‘బాహుబలి’లో రానా బలిష్టంగా ఉన్నారు. ఆ తర్వాత సడన్‌గా సన్నబడ్డారు. దాంతో చాలామందికి సందేహాలు మొదలయ్యాయి. ఆ తర్వాత రానా ఆరోగ్యం బాగా లేదనే వార్త ప్రచారంలోకి వచ్చింది. కిడ్నీ సంబంధింత సమస్యతో రానా బాధపడుతున్నారన్నది ఆ వార్త సారాంశం. హైదరాబాద్, ముంబైలలో కొంత కాలంగా చికిత్స పొందుతున్నారని ఫిల్మ్‌ నగర్‌ టాక్‌.

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయనఆపరేషన్ కోసం యుఎస్ వెళ్ళారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. దానికి తగినట్లు రానా బాగా సన్నబడటంతో అనారోగ్యం కారణంగానే అలా తగ్గిపోయాడన్న ప్రచారం కూడా జరిగింది. ఆ వార్తల్లో నిజమెంత అన్నది తెలియక అభిమానుల్లో కొంత ఆందోళన వ్యక్తమైంది.

అక్కడితో ఆగకుండా తాజాగా అమెరికాలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగిందని, రానా తల్లి లక్ష్మి తనయుడికి కిడ్నీ దానం చేశారనే వార్త షికారు చేస్తోంది. ప్రస్తుతం రానా అమెరికాలో విశ్రాంతి తీసుకుంటున్నారని కూడా చెప్పుకుంటున్నారు. కొద్దిరోజుల తర్వాత మళ్లీ షూటింగ్స్‌తో బిజీబిజీగా ఉంటారట. అయితే ఈ విషయంపై రానా కుటుంబం స్పందించలేదు.

అయితే ఈ విషయంపై రానా స్పందిచారు. ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ‘డియర్ కామ్రేడ్’ విడుదల నేపథ్యంలో విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు తెలుపుతూ రానా ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ మేరకు ఒక అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. దానికి స్పందించిన రానా ‘అలాంటి వార్తలు చదవడం ఆపండి’ అని రిప్లై ఇచ్చారు. దీంతో ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఇక స్వయంగా రానాయే తన హెల్త్ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కుదుటపడ్డారు.

ఇదిలా ఉంటే రానా ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. మంగళవారం ‘డియర్‌ కామ్రేడ్‌’కి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ, ట్వీట్‌ చేశారు రానా. అలాగే బుధవారం సాయంత్రం ‘బాహుబలి’ లండన్‌ షో గురించి కూడా ఓ ట్వీట్‌ పెట్టారు.