‘టెర్మినేటర్‌’ఆర్నాల్డ్‌ కూతురు పెళ్లి, పెళ్లి కొడుకు ఎవరంటే

‘టెర్మినేటర్‌’ హీరో ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌ కుమార్తె కేథరీన్‌ వివాహం ఘనంగా జరిగింది. ఆమెను సూపర్‌ హిట్‌ సినిమా ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’లో సూపర్‌ హీరోగా నటించిన క్రిస్‌ ప్రాట్‌.. వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ శనివారం కాలిఫోర్నియాలోని మోంటెసిటో నగరంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

క్రిస్‌ ప్రాట్‌కు ఇది రెండో వివాహం. అంతకుముందు ప్రాట్‌కు ఆన్నా ఫారిస్‌ అనే నటితో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. 2017లో ప్రాట్‌, ఆన్నా విడాకులు తీసుకున్నారు. మరో విషయం ఏంటంటే.. ప్రాట్‌ కంటే కేథరీన్‌ వయసులో పదేళ్లు చిన్నది. క్రిస్‌ ప్రాట్‌ ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ చిత్రంలో స్టార్ లార్డ్‌ అనే సూపర్‌ హీరో పాత్రలో నటించారు.