పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసిన హీరో.. మూడు రోజుల పాటు సంబురాలు..!

మొన్న‌టి వ‌ర‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌గా ఉన్న సెల‌బ్రిటీలు ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. గ‌త ఏడాది చాలా మంది త‌మ ప్రేయ‌సితో ఏడ‌డుగులు వేయ‌గా, ఈ సంవ‌త్సరం కూడా కొంద‌రు స్టార్స్ పెళ్లి చేసుకోనున్నారు. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ త‌న పెళ్లిపై నోరు విప్పాడు. అన్నీ కుదిరితే వరుణ్‌ లాంగ్‌ టైమ్‌ గర్ల్‌ ఫ్రెండ్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌ నటాశా దలాలేని ఈ ఏడాదే పెళ్లి చేసుకుంటాన‌ని అన్నాడు. దీంతో అభిమానులు స‌మ్మ‌ర్‌లో పెళ్లి చేసుకుంటాడేమోన‌ని ముచ్చ‌టించుకున్నారు. కాని ఈ నెల‌లోనే వ‌రుణ్ ధావ‌న్ పెళ్లి ఉంటుంద‌నే వార్త అంద‌రికి షాకింగ్‌గా మారింది.

క‌రోనా లేక‌పోతే వ‌రుణ్ ధావ‌న్, న‌టాషా దలాలే వివాహం గ‌త ఏడాదిలోనే జ‌రిగి ఉండేది. కాని వారి వివాహానికి క‌రోనా బ్రేక్ వేయ‌డంతో జనవరి 24న ముంబైలోని అలీబాగ్‌లో పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఈ పెళ్లికి త‌క్కువ మంది అతిథులు హాజ‌రు కానున్న‌ట్టు స‌మాచారం. అలీబాగ్‌ లోని బీచ్‌ కు ఎదురుగా ఉన్న మొత్తం రిసార్ట్‌ను పెళ్లి వేడుక కోసం ధావన్ కుటుంబం బుక్ చేసుకున్నట్లు ముంబైలో వార్తలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. పెళ్లికి ప‌ది రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌డంతో ఏర్పాట్ల‌లో వ‌రుణ్ ధావ‌న్ తండ్రి డేవిడ్ ధావ‌న్ చాలా బిజీగా ఉన్నార‌ట‌.

జ‌న‌వ‌రి 22 నుండి వ‌రుణ్ ధావ‌న్ వివాహ వేడుక మొద‌లు కానున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి స‌ల్మాన్, షారూఖ్‌ల‌తో పాటు ప‌లువురు హీరోలు హాజ‌రు కానున్నార‌ని టాక్. పెళ్లి త‌ర్వాత ముంబైలోని స్టార్ హోట‌ల్‌లో బాలీవుడ్ సెల‌బ్స్ కోసం ప్ర‌త్యేక పార్టీ కూడా ఏర్పాటు చేశాడ‌ని స‌మాచారం. ఈ ఏడాది కూలీ నెం 1 చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన వ‌రుణ్ ధావ‌న్ ప్ర‌స్తుతం ‘జగ్‌ జగ్‌ జీయో’ చిత్రంలో నటిస్తున్నారు. అనిల్‌ కపూర్‌, నీతూ కపూర్‌, కియారా అద్వానీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.