కీర్తి సురేష్‌, అనిరుధ్ పెళ్లిపై వ‌చ్చిన పూర్తి క్లారిటీ..!

సోష‌ల్ మీడియా ప్రాచుర్యంలోకి వ‌చ్చాక ఎక్క‌డ ఏది జ‌రిగిన కొద్ది నిమిషాల‌లో ఆ వార్త అంద‌రికి చేరుతుంది. అది మంచైన, చెడు అయిన ఇట్టే వైర‌ల్ అవుతుంది. కొద్ది రోజులుగా మ‌హాన‌టి ఫేం కీర్తి సురేష్‌, త‌మిళ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌లు పెళ్లి చేసుకోబోతున్నార‌నే ఓ వార్త సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అయితే ఇందులో ఎంత క్లారిటీ ఉందో తెలియ‌క అభిమానులు, ప‌లువురు సెల‌బ్స్ కూడా అయోమ‌యంలో ఉండిపోయారు. దీనిపై కీర్తి సురేష్ కాని లేదంటే అనిరుధ్ కాని స్పందిస్తారా అంటే అది లేదు. ఎట్ట‌కేల‌కు కీర్తి సురేష్‌, అనిరుధ్‌ల క్లోజ్ ఫ్రెండ్ ఒకరు వీరిద్ద‌రి రిలేష‌న్‌పై పూర్తి క్లారిటీ ఇచ్చారు.

కీర్తి సురేష్‌, అనిరుధ్‌లు వివాహం చేసుకోబోతున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌లో ఏ మాత్రం నిజం లేదు. వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న‌ది స్నేహం. కొంద‌రు కావాల‌నే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. ఇద్ద‌రి పెళ్లిపై వ‌స్తున్న వార్త‌లు పూర్తిగా అవాస్త‌వం అంటూ వారి ఫ్రెండ్స్ తెలియ‌జేశారు. దీంతో పుకార్లుకు పులిస్టాప్ ప‌డ్డ‌ట్టు అయింది.కాగా, గ‌తంలో తమిళ కమెడియన్ సతీష్‌తో లింక్ పెడుతూ వార్తలొచ్చాయి. దానికి ముందు కేరళలో ఓ రాజకీయ నాయకుడి కుమారుడిని కీర్తి సురేష్ పెళ్లాడబోతుందనే వార్తలు వచ్చాయి. అవ‌న్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి.

ఇక అనిరుద్ విష‌యానికి వ‌స్తే మ‌నోడు గ‌తంలో ఆండ్రియా అనే యువ‌త‌తితో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలాడు. ఇద్ద‌రు క‌లిసి చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఆ త‌ర్వాత ఆండ్రియా త‌మ రిలేష‌న్ బ్రేక్ అయింద‌ని చెప్ప‌డంతో అంతా కామ్ అయ్యారు. ఇక ఇప్పుడు కీర్తి సురేష్‌తో అనిరుధ్ ప్రేమ‌, పెళ్ళి అనే స‌రికి అంతా షాక్ అయ్యారు. కీర్తి ప్ర‌స్తుతం మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ ‘రంగ్ దే’ ‘గుడ్ లక్ సఖి అనే చిత్రాలు చేస్తుండ‌గా, త‌మిళంలోను ప‌లు సినిమాల‌కు సైన్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇక‌ అనిరుధ్ ప్రస్తుతం తన స్నేహితుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న కమాండర్ 65 చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు.