వివాహం..
వివాహం.. ప్రతీ ఒక్కరి జీవితంలో ప్రధాన ఘట్టాలలో ఒకటి. హిందూ సంప్రదాయాలలో అనేక విశేషాలు ఉంటాయి. వివాహంలో అనేక ఘట్టాలు ఉంటాయి. వాటిలో ఒకటి మామ అల్లుడు కాళ్లు కడిగేది. అయితే వయస్సులో పెద్దవాడైన మామ చిన్నవాడైన అల్లుడి కాళ్లు కడగడం అనేది కొంత ఇబ్బంది కరమైన విషయం.కానీ దీనిలో అర్థం.. కన్యను దానం చేయడం వివాహ ఉద్దేశం. దీనిలో దానం తీసుకునేవాడు చిన్నవాడైన ఇచ్చేవారు తప్పక వారికి అర్ఘ్యపాదులు ఇవ్వాల్సిందే. ఈ ఘట్టం వరకు మాత్రమే మామ అల్లుడి పాదాలను శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి తాకుతారు.
తర్వాత మాత్రం ప్రతీ సారి అల్లుడు మామ పాదాలకు నమస్కారం చేయాల్సిందే. ఈ విషయం పరిశీలిస్తే…వివాహంలో కన్యాదానం ప్రదాన తంతు. పెళ్లిలో వరుడి కాళ్లు వధువు తండ్రి కడగడం సంప్రదాయంగా వస్తోంది. ఇలా పెళ్లికొడుకు కాళ్లు కడగడానికి ఓ కారణ ముంది. అసలీ తంతు ఎలా జరుపుతారంటే… ముందు గా కళ్యాణ వేదికపై వరుణ్ణి పడమటి ముఖంగా కూర్చో బెడతారు. కన్యాదాత తూర్పుముఖంగా కూర్చుం టాడు. వరుణ్ణి శ్రీమహావిష్ణు స్వరూపునిగా భావించి కన్యాదాత పూజించి సత్కరిస్తాడు.
నీటిని అభిమంత్రించి మొదట కుడికాలు, తరు వాత ఎడమ కాలును మామ కడుగుతాడు. “కుడికాలుని మహేంద్రుని అంశగానూ, ఎడమ పాదాన్ని ఇంద్రుని అంశగా భావి స్తు న్నాను. నీ పాదాలను రక్షించే దేవతలను పూజిం చిన ఈ జలం నా శత్రువులను కాల్చివేస్తుంది’ అని మామ చెప్పినట్లుగా ఉండే మంత్రాలను పురోహితులు చదువుతారు. కాళ్లు కడిగిన నీళ్లను కన్యాదాత దంపతులు కొద్దిగా శిరస్సుపై చల్లుకోవడం ఆచారం. అర్ఘమిచ్చి, ఆచమనం చేయించిన తరువాత మధుపర్కం అందిస్తారు.