చైనా కుర్రాళ్లకు ఆమె ఓ ఆరాధ్యదేవత. అందుకేనేమో చైనా ఫేస్ బుక్ అయిన సీనా వీబోలో అమెకు ఏకంగా 6.2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇరవై ఏళ్లుగా చైనా సినీ ప్రపంచంలో తన అందచందాలు, నటనతో ఏలుతోంది. అయితే 37 ఏళ్ల ఫాన్ గతేడాది జులైలో ఉన్నట్టుండి మాయమయ్యారు. ఆ తర్వాత ఆమె ఏమైందో, ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియరాలేదు. ఇలా మాయమైపోవటానికి ముందు ఆమెపై భారీగా పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి. ఆమెను హౌస్ అరెస్ట్ చేసారంటూ, జైల్లో ఉందంటూ రకరకాల రూమర్స్ వచ్చాయి.
మరో టాక్స్ ఎగ్గొడితే చైనాలో కఠిన శిక్షలు విధిస్తారన్న భయంతో ఫాన్ బింగ్ బింగ్ విదేశాలకు పారిపోయి ఉండొచ్చని అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది. అయితే అందరినీ షాక్ కి గురిచేస్తూ ఫాన్ ఇటీవల ఓ ప్రయివేటు ఈవెంట్ లో ప్రత్యక్షమయ్యింది. రెడ్ కార్పెట్ పై తన అందాలతో అలరిస్తూ నడిచిన ఈమెను చూసి అందరూ విస్తుపోయారు.
తన రీఎంట్రీని పురస్కరించుకుని అమ్మడు సోషల్ మీడియాలో పోస్టు పెడితే, ఫ్యాన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ కనిపించింది. అయితే ఆమె రాకకు కారణం…చైనా ఆదాయ పన్ను శాఖతో ఫాన్ రాజీపడినట్టు, పన్ను చెల్లింపుకు అంగీకారం తెలిపినట్టు సమాచారం.