డిస్ట్రిబ్యూటర్ల భయం..రిలీజ్ రద్దు?

సూపర్‌స్టార్ రజనీకాంత్‌, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘2.0’ సినిమా చైనాలో భారీ ఎత్తున విడుదల కాబోతోందంటూ ఆ మధ్యన వార్తల వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడ ఆ పరిస్దితులు కనపడటం లేదు. సినిమా విడుదలయ్యే అవకాశం కనిపించడంలేదు. జులై 12న సినిమా విడుదల నిర్ణయాన్ని విరమించుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

మొదట ఈ చిత్రం టైటిల్ టైటిల్‌ను ‘రోబో 2.0: రీసర్జెన్స్‌’ అని మార్చి.. 56,000 స్క్రీన్లపై విడుదల చేయాలని హెచ్‌వై మీడియా సంస్థ నిర్ణయించుకుంది. కానీ సినిమాను చైనాలో విడుదల చేస్తే డిస్ట్రిబ్యూటర్లకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్‌వై మీడియా సంస్థ భావిస్తోందట.

అందుకు కారణం ఏమిటంటే… ఆల్రెడీ అక్కడ అక్షయ్‌కుమార్‌ నటించిన ‘ప్యాడ్‌మ్యాన్‌’ సినిమా అక్కడ అట్టర్‌ ఫ్లాపైంది. సినిమా విడుదల ఖర్చును కూడా రికవరీ చేయలేకపోయింది. దాంతో ‘2.0’ సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్స్ భయపడిపోతున్నారు. ఆ సినిమా కూడా ఆడదేమోనని డిస్ట్రిబ్యూటర్లు వద్దంటున్నారు.

ట్రేడ్ లెక్కల ప్రకారం చైనాలో ‘2.0’ను విడుదల చేస్తే 25 మిలియన్‌ డాలర్లు వసూలు చేయాలి. అప్పుడే డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వాటిల్లదు. అదీకాకుండా ‘ది లయన్‌ కింగ్‌’ సినిమా కూడా జులైలోనే విడుదల అవుతున్న నేపథ్యంలో రిస్క్‌ ఎందుకని భావించిన డిస్ట్రిబ్యూటర్లు ‘2.ఓ’ విడుదలను రద్దు చేయాలని అనుకుంటున్నారట. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.